Begin typing your search above and press return to search.

బాలీవుడ్ బాట పట్టిన మన దర్శకులు టాలీవుడ్ లో క్రేజ్ కోల్పోతున్నారా...?

By:  Tupaki Desk   |   30 Sep 2020 12:30 AM GMT
బాలీవుడ్ బాట పట్టిన మన దర్శకులు టాలీవుడ్ లో క్రేజ్ కోల్పోతున్నారా...?
X
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అందుకే ఇతర ఇండస్ట్రీల డైరెక్టర్స్ కూడా హిందీలో సినిమాలు తీసి మార్కెట్ పెంచుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అప్పట్లోనే ఆదుర్తి సుబ్బారావు - కె. బాపయ్య - బాపు - దాసరి నారాయణరావు - కె. రాఘవేంద్రరావు - కె. విశ్వనాథ్ - ఈవీవీ సత్యనారాయణ - రవిరాజా పినిశెట్టి వంటి దర్శకులు హిందీలో సినిమాలు డైరెక్ట్ చేశారు. వారిలో కొందరు సక్సెస్ సాధించగా మరికొందరు పరాజయాలు అందుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో రామ్ గోపాల్ వర్మ - తేజ - విజయ్ భాస్కర్ - కృష్ణవంశీ - పూరీ జగన్నాథ్ బాలీవుడ్ లో అడుగుపెట్టారు. వీరిలో ఒక్క ఆర్జీవీ మాత్రమే ఇప్పటికే హిందీ సినిమాలు తీస్తున్నాడు. ఇక బాలీవుడ్ బాట పట్టిన టాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ - డీకే లను తెలుగు దర్శకులనే విషయమే అందరూ మర్చిపోయారు. అయితే వీరిద్దరూ హిందీలో స్థిరపడిపోయి సక్సెస్ సాధించారు. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కి వెళ్లిన మన డైరెక్టర్లు టాలీవుడ్ లో క్రేజ్ పోగొట్టుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. నెక్స్ట్ సినిమా తెలుగులో కాకుండా హిందీలో చేసాడు. అదే సినిమాని బాలీవుడ్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ తో తీసి సక్సెస్ సాధించాడు. అయితే 'అర్జున్ రెడ్డి' తో వచ్చిన క్రేజ్ ని బాలీవుడ్ కు వెళ్లి నిలబెట్టుకోలేకపోయాడని సినీ జనాలు అనుకుంటున్నారు. అందుకే సందీప్ తెలుగులో మరో ప్రాజెక్ట్ కమిట్ అవలేకపోతున్నాడు. అలానే 'ప్రస్థానం' సినిమాని హిందీలోకి తీసుకెళ్లిన దేవా కట్టా అక్కడ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. దీంతో తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయడానికి చాలా కాలమే పట్టింది. ఇక 'ఘాజీ' సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి.. హిందీలో స్ట్రయిట్ మూవీ చేస్తున్నట్లు అప్పుడెప్పుడో ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి మరో అప్డేట్ లేదు.. తెలుగులో మరో సినిమా లేదు. గతేడాది 'జెర్సీ' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న గౌత‌మ్.. అదే సినిమాని హిందీలో రీమేక్ చేయ‌డానికి బాంబే వెళ్ళాడు. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకా బయటకు రాలేదు. దీంతో టాలీవుడ్ లో అతన్ని మర్చిపోయే పరిస్థితి వచ్చిందని కామెంట్స్ వస్తున్నాయి. వీరి కంటే ముందే బాలీవుడ్ లో అడుగుపెట్టి 'గబ్బర్' సినిమా తీసిన క్రిష్ జాగర్లమూడి కూడా తెలుగులో హిట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే మార్కెట్ విస్తరించుకునే క్రమంలో హిందీ ఇండ‌స్ట్రీలోకి వెళ్లిన మన దర్శకులు లోకల్ లో క్రేజ్ ని కోల్పోతున్నారని తెలుస్తోంది.