టాలీవుడ్ బూతు బాలీవుడ్ ని మించేలా

Sun Feb 16 2020 05:00:04 GMT+0530 (IST)

Tollywood Crosses Bollywood Interms Adult Films

టాలీవుడ్ లో బూతు సినిమాల వెల్లువ ఇటీవల అంతకంతకు పెరుగుతోంది. 2019లో రకరకాల బూతు టైటిల్స్ తో వేడెక్కించే పోస్టర్లతో వరుస సినిమాలు అగ్గి రాజేశాయి. ఏడు చేపల కథ - చీకటి గది లో చితక్కొట్టుడు .. ఇలాంటి టైటిల్స్ తో పలు సినిమాలొచ్చాయి. ప్రస్తుతం డిగ్రీ కాలేజ్ అంటూ మోటైన డైలాగ్స్ తో బూతును పచ్చిగానే చూపిస్తుండడం యువతరం లో చర్చకు వచ్చింది. అయితే ఇది సరైనదేనా? అంటే .. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది.రెండు మూడేళ్ల క్రితం కేవలం బాలీవుడ్ లో మాత్రమే ఈ అడల్ట్ సినిమాల జోరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు తెలుగులో చాలా కామన్ అయిపోయాయి. అలాగే సెక్స్ అనే పదాన్ని అసలు సిగ్గు అనేది లేకుండా వినిపించేస్తున్నారు. అది కూడా కథానాయికలతో అలాంటి బూతు పదాల్ని చెప్పించేస్తున్న దౌర్భాగ్యం కనిపిస్తోంది. ఇటీవల డిజిటల్- ఓటీటీ కంటెంట్ వెల్లువతో ఇప్పటికే అంతర్జాలం జుగుప్సను పెంచేసింది. రెగ్యులర్ సాంప్రదాయవాదులకు ఇది ఏమాత్రం మింగుడు పడని పరిణామం. సెక్స్.. బూతు అనేవి ఇప్పుడు టీనేజర్స్ అరచేతిలో అందుబాటులోకి వచ్చేయడం ఒక రకంగా పేరెంట్ ని బెంబేలెత్తిస్తోంది. ఇక వెబ్ సిరీస్ లకు పిల్లలు బాగా అడిక్ట్ అవుతున్నారు. వర్జిన్ ఎట్ 27 అంటూ హాట్ వెబ్ సిరీస్ ఇంతకు ముందు టీనేజర్స్ లో వైరల్ అయ్యింది.


సెక్స్ నాకు అసలు సమస్యే కాదు అంటూ ఇంతకు ముందు నిర్మాత ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఎక్స్ లాంటి డీగ్రేడ్ సినిమాని ఏక్తా తెరకెక్కించింది. లస్ట్ స్టోరీస్.. సెక్రేడ్ గేమ్స్.. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్- ట్రిపుల్ ఎక్స్ లో బూతును పరాకాష్టలో చూపించారు. ఇవన్నీ పెద్ద తెరపై బూతును పెంచి పోషించాయనే చెప్పాలి. ఇక ఇలాంటి అడల్ట్ కంటెంట్ సినిమాల విషయంలో సెన్సార్ బోర్డ్ చూసీ చూడనట్టే వ్యవహరిస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు మరింత రెచ్చి పోతున్నారు. రోజుకో అడల్ట్ సినిమా.. వెబ్ సిరీస్ దూసుకొస్తూ యూత్ లో హాట్ టాపిక్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ పంథాని ద్వితీయ శ్రేణి నిర్మాతలు అనుసరిస్తూ సినిమాలు తీసి కాసులు కొల్లగొట్టాలని చూస్తున్నారు.


ఈ కేటగిరీలోనే ఇదిగో తాజాగా `15 -18 - 24 లవ్ స్టోరి` అంటూ మరో సినిమా వస్తోంది. దీనికి సంబంధించి ఘాటైన పోస్టర్ ని మేకర్స్ రివీల్ చేశారు. అంతా కొత్త కుర్రాళ్ల తో కిరణ్ కుమార్ మడుపురి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమ్మాయి అబ్బాయి పెదవి ముద్దులు.. అర్థనగ్నంగా టాప్ లెస్ ఫోజులు.. బోయ్ ని గాళ్ అల్లుకుపోయిన ఫోజు ఇవన్నీ యూత్ ని టీజ్ చేసేలా డిజైన్ చేశారు. అయితే ఇలాంటి బూతు పోస్టర్లు చూసి జనం థియేటర్లకు వెళ్లరు. సినిమాలో కంటెంట్ మాత్రమే థియేటర్లకు రప్పించగలుగుతోందని ప్రూవ్ అయ్యింది. డీసెంట్ పోస్టర్ వేసి ఘాటైన కంటెంట్ ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్లాసిక్ గా చూపించి ఎందరో హిట్లు కొట్టిన సంగతిని మరువరాదు.