హిందీ అర్జున్ గురించి మన అర్జున్ కామెంట్స్

Tue Sep 14 2021 17:10:51 GMT+0530 (IST)

Tollywood Arjun? Comments? About Bollywood Arjun

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం వచ్చిన 'జెర్సీ' సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు సైతం దక్కించుకున్న జెర్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. హిందీలో కూడా ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో ఎక్కువ మార్పులు లేకుండా హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కాస్త స్క్రీన్ ప్లేలో మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు జెర్సీలో అర్జున్ పాత్రను నాని పోషించగా హిందీ జెర్సీలో అర్జున్ రాయ్చంద్ పాత్రను బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇక హీరోయిన్ గా మృనాల్ ఠాకూర్ నటిస్తుంది. షూటింగ్ ముగిసిన ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వల్ల ఆలస్యం అయిన ఈ రీమేక్ కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. కనుక ఖచ్చితంగా మంచి విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.జెర్సీ హిందీ వర్షన్ ను అల్లు అరవింద్ మరియు దిల్ రాజులు కలిసి బాలీవుడ్ నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నారు. జెర్సీ హిందీ రీమేక్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిందీ జెర్సీకి సంబంధించిన కొన్ని షాట్స్ మరియు స్టిల్స్ ను నాకు దర్శకుడు గౌతమ్ చూపించాడు. అవి నాకు చాలా బాగా నచ్చాయి. తప్పకుండా సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. గౌతమ్ చాలా తక్కువ మాట్లాడుతారు. ఆయన కళ్లలో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కనిపిస్తుంది. సినిమా ఎంత అద్బుతంగా వచ్చిందో ఊహించుకోగలను. తప్పకుండా ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకంను నాని వ్యక్తం చేశాడు.

నాని వ్యాఖ్యలతో హిందీ జెర్సీపై చాలా ఆసక్తి వ్యక్తం అవుతోంది. తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేయడంతో పాటు దర్శకుడు పై తన నమ్మకంను కూడా తెలియజేశాడు. హిందీ జెర్సీ హీరో షాహిద్ పై కూడా నాని కామెంట్స్ చేశాడు. షాహిద్ క్యారెక్టర్ లో లీనం అయ్యాడనిపించింది. పాత్రకు పూర్తి న్యాయం చేసే విధంగా అతడి నటన ఉంటుందనే నమ్మకం ఉందని నాని పేర్కొన్నాడు. షాహిద్ కపూర్ జెర్సీ తప్పకుండా ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయంను నాని వ్యక్తం చేశాడు. నాని మరోసారి థియేటర్ల రిలీజ్ పై వ్యాఖ్యలు చేశాడు. సినిమాను థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు చూసిన థ్రిల్ ఫీలింగ్ ఓటీటీలో చూస్తే రాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే నాని తప్పని పరిస్థితుల్లో తన టక్ జగదీష్ ను ఓటీటీలో విడుదల చేయడం జరిగింది.