102 డిగ్రీల ఫీవర్..కుమార్తెని పట్టించుకోని సుమ!

Wed Jun 29 2022 09:00:01 GMT+0530 (IST)

Tollywood Anchor Suma

సీనియర్ యాంకర్ సుమ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా..నటిగా..హోస్ట్ గా తెలుగు ప్రేక్షకుల్ని కొన్ని దశాబ్ధాలుగా అలరిస్తున్నారు. ముఖ్యంగా బుల్లి తెరపై సుమకి అసాధారణమైన గుర్తింపు దక్కింది. సినిమా ఈవెంట్ల స్టేజ్ లు దద్దరిల్లాలంటే? సుమ తప్పనిసరి అయిపోయారు.  దాదాపు అగ్ర హీరోలందరి సినిమా ఈవెంట్లపై సుమ అనే శాసనం ఎప్పుడో రాసేసారు.ఆ స్థాయికి రావడం వెనుక ఎంతో శ్రమ ఉంది. వృత్తిపై నిబద్ధత... చేసే పనిపై మనసు లగ్నం చేయడం ఇలా ఎన్నో అంశాలు చేసే పనిపై ప్రభావాన్ని చూపిస్తాయి.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమకి ఎదురైన ఓ ఘటన గురించి తలుచుకుని కన్నీళ్లు చెమర్చారు. ఓ సారి ఆఘటనలోకి వెళ్తే..

`` కొన్నేళ్ల క్రితం సమ కుమార్తెకు చిన్న వయసులో ఓ రోజు 102 డిగ్రీల తీవ్రమైన జ్వరం.  తనతో పాటే ఉంటానని పట్టుబట్టలింది ఆ బిడ్డ. దీంతో తప్పక స్టార్ మహిళ షూటింగ్ తీసుకెళ్లింది. కింద ప్లోర్ రూమ్ లో కుమార్తెని పడుకోబెట్టి సుమ షూట్ లో బిజీ అయ్యారు. మధ్యలో గ్యాప్ దొరికనప్పుడల్లా వెళ్లి డాటర్ ని చూసి వచ్చేవారు. అదే రోజు ఇంకా కొన్ని ప్రోగ్రామ్ లు అదనంగా ఉండటంతో వాటిని హోస్ట్ చేయాల్సి వచ్చిందిట. ఆ రోజు సాయంత్రమే  ఓ స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళా వేదికలో.

మరి అక్కడ పరిస్థితి ఏంటి? టీవీ షో షూటింగ్ లో పడుకోవడానికి బెడ్లు ఏర్పాటు  ఉంటుంది.  కానీ శిల్ప కళా వేదికలో మ్యాకప్ రూమ్ లు తప్ప మంచాలుండవు. దీంతో కుమార్తెని రూమ్ లో చిన్న సెల్ప్ పై పడుకోబెట్టి అక్కడ తోడుగా మరో మనిషిని ఏర్పాటు చేసి స్టేజ్ మీదకి వచ్చారుట. కానీ ఆక్షణం స్టేజ్ పైకి రాగానే వెంటనే కుమార్తెని మర్చిపోయి ప్రోగ్రామ్ హడావుడిలో పడిపోయారుట.

కూతురికి అంత ఫీవర్ గా ఉన్నా..ఫ్రీగా ఎలా యాంకరింగ్ చేసారంటే? అప్పుడు అలాంటి సెంటిమెంట్ లు పట్టించుకోకూడదని సుమ నిర్మోహమాటంగా చెప్పేసారు. చేసే పనిపై మనసు పెట్టాలి. అది పూర్తయ్యే వరకూ వేరే ఆలోచన లేకుండా  ముందుకు వెళ్లాలి. మధ్యలో డిస్టబెన్స్ అయితే ప్రోగ్రాం మటాష్ అవుతుంది. కెరీర్ అక్కడితో క్లోజ్ అయిపోతుందని సుమ వర్క్ డెడికేషన్ గురించి` చెప్పుకొచ్చారు.