Begin typing your search above and press return to search.

కొత్త ఏడాది మూడు నెల‌లు ఫ్యాన్స్ పండగేనా!

By:  Tupaki Desk   |   24 Oct 2021 11:30 PM GMT
కొత్త ఏడాది మూడు నెల‌లు ఫ్యాన్స్ పండగేనా!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యంగ్  టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ పై ఇంకా స‌రైన క్లారిటీ  రాలేదు. కానీ `ఆర్ ఆర్ఆర్` సంక్రాంతి కానుక‌గా జన‌వ‌రిలో రిలీజ్ అవుతుంద‌ని బ‌ల‌మైన సంకేతాలు అందుతున్నాయి. జ‌న‌వ‌రి 7న చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మిగిలిన సినిమాలు వేర్వేరు తేదీల్నిలాక్ చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ఆచార్య` ని ఫిబ్ర‌వ‌రి 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.  అలాగే విక్ట‌రీ వెంక‌టేష్..మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న `ఎఫ్ 3` చిత్రాన్ని అదే నెల 24 రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

దీన్ని బ‌ట్టి సంక్రాంతి రేస్ నుంచి `ఎఫ్ 3` ఎగ్జిట్ అయిన‌ట్లే తెలుస్తోంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ -రానా న‌టిస్తోన్న `భీమ్లా నాయ‌క్` మార్చి 31న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తోన్న `స‌ర్కారు వారి` పాట కూడా ఏప్రిల్ 28న  రిలీజ్ అనుకుంటున్నారుట‌. వాస్త‌వానికి ఈ సినిమాల్ని సంక్రాంతి కి గ్రాండ్ గా రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేసుకున్నారు. కానీ పాన్ ఇండియా చిత్రం  `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి ఉండ‌టంతోనే ఈ చిత్రాల‌న్ని రిలీజ్ తేదీల్ని మార్చుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇలా కొత్త ఏడాది ప్రారంభం నుంచి మూడు నెల‌ల వ‌ర‌కూ అగ్ర హీరోల చిత్రాల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

గ‌తంలో పోటీ వాతావ‌ర‌ణం న‌డుమ సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఆ పోటీ నిర్మాత‌కు..ఎగ్జిబిట‌ర్ల‌కు..పంపిణీదారుల‌కు న‌ష్టాలు త‌ప్ప లాభాలు కాద‌ని భావించే హెల్దీ వాతావ‌ర‌ణంలోకి స్టార్టు దిగిపోయారు. ఈ మార్పు వెనుక మ‌రో కీల‌క విష‌యం కూడా ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ఏప్రీ ప్ర‌భుత్వం టిక్కెట్ ధ‌ర‌ల‌పై భారీగా కోత వేసిన సంగ‌తి తెలిసిందే.  ఇలాంటి స‌మ‌య‌లో పోటీగా రిలీజ్ అయితే వ‌చ్చేవి భారీగా న‌ష్టాలు త‌ప్ప లాభాలు కాదు అన్న సంగ‌తి నిర్మాత‌ల‌కి బాగా తెలిసొచ్చిన‌ట్లుంది.