కోవిడ్ రోగుల సహాయ నిధి సేకరణలో రకుల్

Wed May 12 2021 21:00:02 GMT+0530 (IST)

To help Covid19 patients Rakul Preet Singh starts a fundraiser urges everyone to contribute

కోవిడ్ రోగులకు సహాయం చేయడానికి రకుల్ ప్రీత్ విరాళాల సేకరణను ప్రారంభించనున్నారు. ఆస్పత్రుల్లో నిరంతరం కొరతగా ఉన్న ఆక్సిజన్ .. బెడ్లు ఇతర లైవ్-సేవింగ్ పరికరాలతో పాటు .. ఆక్సిజన్ రీఫిల్లింగ్ ను అందించడంలో సహాయపడతామని రకుల్ వెల్లడించారు.``మన దేశం ప్రస్తుత దుస్థితిని చూడలేకపోతున్నాం. ఆక్సిజన్ - పడకలు- మందులు ఇలా మరెన్నో కొరత కారణంగా ప్రజలు తమ పోరాటం సాగించలేకపోతున్నారు. `గివ్ ఇండియా`తో ఈ నిధుల సమీకరణ ద్వారా మా లక్ష్యం ఆక్సిజన్ అందించడం.. ప్రత్యక్ష పొదుపు పరికరాల సరఫరాతో కింది స్థాయిలో ఆస్పత్రులకు మద్దతునిచ్చి ఉపశమనం అందించడమే`నని అన్నారు. ప్రజలంతా తమవంతు సహకరించాలని కోరారు. చిన్న మొత్తాలు కూడా చాలా మందికి సహాయపడతాయని తెలిపారు.

``మేం కోరేది రూ .100 నుంచి.. ప్రజలకు వీలైనంత సాయం చేస్తారని ఆశిస్తున్నాం. అయితే 100 రూపాయల సహకారం చాలా దూరం వెళ్తుంది.  నిస్సహాయంగా ఉన్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను`` అని అన్నారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ సహా టాలీవుడ్ లో క్రేజీ నాయికగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.