Begin typing your search above and press return to search.

టైటిల్ గ్లింప్స్ : నిజాన్నిచూపించే మ‌రో నేత్రం విరూపాక్ష

By:  Tupaki Desk   |   7 Dec 2022 6:11 AM GMT
టైటిల్ గ్లింప్స్ : నిజాన్నిచూపించే మ‌రో నేత్రం విరూపాక్ష
X
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ లైన్ లోకి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. కొత్త సినిమాల విష‌యంలో మూస‌ధోరిణి వ‌దిలిన‌ట్లే క‌నిపిస్తుంది. పాత ప‌ద్ద‌తికి స్వ‌స్తి ప‌లికి ట్రెండింగ్ హిట్ కాన్సాప్ట్ ల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇటీవ‌లే జ‌యంత్ పానుగంటి అనే కొత్త కుర్రాడ్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమా లాంచ్ చేసారు. దీన్నీ శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్ ప్ర‌తిష్టాత‌మ‌కంగా నిర్మిస్తుంది. 'రిప‌బ్లిక్' త‌ర్వాత తేజ్ సెట్స్ పైకి తీసుకెళ్లిన చిత్ర‌మిది.

అలాగే ఇటీవ‌లే కార్తీక్ దండుతో కూడా కొత్త సినిమా లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే ఈసినిమా టైటిల్ స‌హా గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇది మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్కి 'విరూపాక్ష' అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు. చిన్న గ్లింప్స్ తోనే సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేసారు అనొచ్చు. టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. స‌స్పెన్స్ ఇంటెన్స్ థ్రిల్ల‌ర్ అని గ్లింప్స్ తోనే క్లారిటీ వ‌చ్చేస్తుంది.

ఓ సారి గ్లింప్స్ లోకి వెళ్తే...ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ తో ప్రారంభ‌మై ..ముగుస్తుంది. 'అజ్ఞానం భ‌యానికి మూలం..భ‌యం మూఢ న‌మ్మ‌కానికి కార‌ణం. ఆన‌మ్మ‌కమే నిజ‌మైన‌ప్పుడు..ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్క‌న‌ప్పుడు అస‌లు నిజాన్నిచూపించే మ‌రో నేత్రం విరూపాక్ష అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. గ్లింప్స్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ టైమింగ్ చ‌క్క‌గా సింక్ అయింది.

నైట్ షూట్ స‌న్నివేశాలు భారీ స్పాన్ తో నే తెర‌కెక్కించిన‌ట్లు హైలైట్ అవుతుంది. అలాగే సాయితేజ్ ఆహార్యం పూర్తిగా మారిపోయింది. సెటిల్డ్ పెర్పార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ లా క‌నిపిస్తుంది. చేతిలో కాగ‌డా....శ‌రీరంపై న‌లుపు వ‌స్ర్తాలు స‌రికొత్త తేజ్ ని ఆవిష్క‌రించిన‌ట్లే క‌నిపిస్తుంది.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంటెన్స్ మోడ్ లోకి తీసుకెళ్తుంది. మ‌రి టైటిల్ గ్లింప్స్ తోనే ఈ రేంజ్లో వ‌చ్చారంటే? టీజ‌ర్..ట్రైల‌ర్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌నున్నారు. ఈచిత్రాన్ని పాన్ ఇండియా లో రిలీజ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.