టిక్ టాక్ భార్గవ్ రేప్ కేసుపై నిత్య స్పందన

Wed Apr 21 2021 12:02:53 GMT+0530 (IST)

Tiktok nitya response to the Bhargav rape case

టిక్ టాక్ పేరుతో పాపులర్ అయిన భార్గవ్ తాజాగా  ఓ మైనర్ బాలిక (14)కు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మైనర్ బాలికను టిక్ టాక్ పేరుతో ఆకర్షించి సినిమాల్లోటీవీ సీరియల్స్ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గర్భవతిని చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.అయితే బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు ఆమె పేరు వెల్లడించారు. ఈ వార్త బయటకు రావడంతో చాలా మంది ‘ఓ మై గాడ్ నిత్య’ పేరును సోషల్ మీడియాలో తెరపైకి తెచ్చారు. భార్గవ్ అత్యాచారానికి పాల్పడింది ఈ అమ్మాయి అంటూ పోస్టు పెడుతున్నారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లలోనూ ఈ అమ్మాయి ఫొటోలు వీడియోలతో వైరల్ చేస్తున్నారు.

దీంతో కలవరపడ్డ నిత్య దీనిపై స్పందించింది. వివరణ ఇఛ్చింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని నిత్య స్పష్టం చేసింది. భార్గవ్ చేతిలో మోసపోయిన అమ్మాయి నేను కాదని ఓ వీడియోను రిలీజ్ చేసింది.

బాలికను రేప్ చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అయ్యాడని.. అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని నిత్య తెలిపింది. సోషల్ మీడియా ద్వారానే తనకు తెలిసిందని వివరణ ఇచ్చింది. భార్గవ్ ను కలిసి ఏడాదిపైనే అయ్యిందని.. నాకు కాంటాక్టులోకూడా లేడని వివరణ ఇచ్చింది. ఇప్పుడు మేం కలిసి వీడియోలు చేయడం లేదు అంది.

  ఈ వివాదంలో చాలా మంది మీమ్స్ చేసే వారు ట్రోలర్స్ యూట్యూబ్ వాళ్లు నా పేరు ఫొటోలు వాడుతున్నారు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నారు. నేను బాధితురాలిని కాదు.. మీకే రెండు రోజుల్లో నిజాలు తెలుస్తాయని నిత్య వీడియోలో చెప్పుకొచ్చింది.  తల్లితో కలిసి ఒక వీడియోను నిత్య రిలీజ్ చేసింది.