Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌'లో 'లక్ష్మణుడు' అతడేనా..?

By:  Tupaki Desk   |   25 Jan 2021 10:09 AM GMT
ఆదిపురుష్‌లో లక్ష్మణుడు అతడేనా..?
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ లైన్ లో పెట్టిన పాన్ ఇండియా సినిమాలలో 'ఆదిపురుష్‌' ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు 'లంకేష్' గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్‌'లో ఇతర ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో లక్ష్మణుడి పాత్రకు సంబంధించిన ఈ క్రేజీ గాసిప్ సోషల్ మీడియాలో ససర్క్యులేట్ అవుతోంది.

'ఆదిపురుష్‌' చిత్రంలో రాముడు సోదరుడు లక్ష్మణుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ నటించనున్నాడట. అలానే సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ని ఫైనలైజ్ చేశారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా, ఈ చిత్రాన్ని 3డి విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక వండర్ లా రూపొందించనున్నారు. ఇందుకోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ మలయాళ కన్నడ భాషలలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అలానే ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలు విదేశీ భాషల్లోకి కూడా అనువాదం చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'ఆదిపురుష్‌' చిత్రాన్ని 2022 ఆగస్టు 11న (11-08-2022) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.