టాలీవుడ్..కోలీవుడ్ లో 'టైగర్-3'..భాయ్ సైతం సీన్ లోకి!

Tue Aug 16 2022 16:00:01 GMT+0530 (IST)

'Tiger 3' in Tollywood n Kollywood Bhai too into the scene!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సైతం సౌత్ లో ఎంట్రీ ఇస్తున్నాడా?  టాలీవుడ్..కోలీవుడ్ మార్కెట్ పైనా భాయ్ కన్నేసాడా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా 'టైగర్ -3' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. టైగర్ మొదటి భాగం రిలీజ్ అయి ఆగస్టు 15 నాటికి సరిగ్గా పదేళ్లు పూర్తయింది.  మొదటి రెండు భాగాలైన 'ఏక్ థా టైగర్'..టైగర్ జిందాహైలకు సంబంధించి  గ్లింప్స్ ని ఇన్ స్టాలో పంచుకున్నారు.నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ యూ ట్యూబ్ లో ప్రత్యేక గ్లింప్స్ వీడియోని సైతం రిలీజ్ చేసింది. పదేళ్ల కిందట  సింహ గర్జన చేస్తూ మీ  హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నాడు. అదే ఊపుతో సల్మాన్ మళ్లీ వస్తున్నాడు.

టైగర్ గర్జన  అభిమానుల అంచనాలు మించి ఉంటుంది. వచ్చే ఏడాది ఈద్ కి థియేటర్లో మోత మ్రోగించడం  ఖాయం.  హిందీతో పాటు..తెలుగు..తమిళ భాషల్లోనూ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టైగర్ సంచలనాలు ఉత్తరాదితో పాటు దక్షిణాది అభిమానుల్లోనూ కొనసాగుతాయని తెలుస్తోంది. బాలీవుడ్ అంతా సౌత్ వైపు చూస్తున్న తరుణ మిదని చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే  అమీర్ 'ఖాన్ లాల్ సింగ్' చడ్డాని తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి  పేరును సమర్పకుడిగా వేసి మరి రిలీజ్ చేసారు. ఇక బాద్ షా షారుక్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని కోలీవుడ్ మేకర్ అట్లీతో తెరకెక్కిస్తున్నాడు. ఇంకా కోలీవుడ్ నటుల్ని సినిమాలో భాగం చేసారు. ఆ రకంగా సౌత్ మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.

మరోవైపు బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ సరైన పాత్రలు దొరికితే తెలుగు సినిమాలు చేయడానికి సిద్దమని సంకేతాలు పంపేసారు. ఇప్పటికే  'సైరా నరసింహారెడ్డి' లో చిరంజీవి గురువు పాత్రలో బిగ్ బీ  కనిపించిన సంగతి  తెలిసిందే.2.0 తో అక్షయ్ కుమార్  సౌతక్ లో విలన్ గానూ ఎంట్రీ ఇచ్చేసారు . ఇంకా మరెంత మంది స్టార్స్ వెయిట్ చేస్తున్నారు.

సౌత్ కంటెంట్ బాలీవుడ్ లో  విజయ దుందుబీ మోగిస్తోంది.  ఈ నేపథ్యంలో భాయ్ కూడా నేను సైతం సై అంటూ రంగంలోకి దిగేస్తున్నారు. సల్మాన్ కి టాలీవుడ్ తో ప్రత్యేకమైన అనుబంధం  ఉంది. అందులోనూ మెగా ఫ్యామిలీతో బాండింగ్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు . చిరంజీవి..రామ్ చరణ్ తో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతారు. ఈ నేపథ్యంలో టైగర్ -3 తెలుగు వెర్షన్  ప్రమోషన్ టైమ్ లో తండ్రితనయులు ఇద్దరు హడావుడి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.