Begin typing your search above and press return to search.

పెద్దోడు అంటే చిన్నోడికి ఎంతటి గౌర‌వం?

By:  Tupaki Desk   |   13 Aug 2020 4:45 AM GMT
పెద్దోడు అంటే చిన్నోడికి ఎంతటి గౌర‌వం?
X
ఒక స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అనుబంధం ఆప్యాయ‌తానురాగాలు ఎలా ఉంటాయో `సీత‌మ్మ వాకిట్లో సిరి మ‌ల్లెచెట్టు` చిత్రంలో చ‌క్క‌గా చూపించారు శ్రీ‌కాంత్ అడ్డాల‌. గోదారి సంస్కృతిలో ప‌చ్చందాల న‌డుమ ఫ్యామిలీ అనుబంధాలు ఈగోల్ని గొప్ప‌గా ఆవిష్క‌రించారు. ఒరేయ్ అన్న‌య్యా.. అంటే ఏంట్రా త‌మ్ముడూ? అనే బంధాన్ని అంతే అద్భుతంగా తీర్చిదిద్దాడు. చిన్నోడా పెద్దోడా అంటూ ఇంట్లో అమ్మా నాన్న పిలుచుకునే విధానం మ‌న‌సుకు హాయిని గొలుపుతుంది.

అన్న‌ద‌మ్ముల పాత్ర‌ల్లో విక్ట‌రీ వెంక‌టేష్ - ప్రిన్స్ మ‌హేష్ ఎంతో గొప్ప‌గా ఒదిగిపోయారు. ఇంట్లో అన్న అంటే త‌మ్ముడికి ఎంత గౌర‌వ‌మో.. బ‌య‌ట కూడా అంతే గౌర‌వం చూపించాడు మ‌హేష్ అన‌డానికి ఇదిగో తాజాగా రివీలైన ఈ పాత ఫోటోనే సాక్ష్యం. ఆన్ లొకేష‌న్ వెంకీ ఏదో చెబుతుంటే మ‌హేష్ ఎంతో గౌర‌వంగా ఇలా దండ క‌ట్టుకుని కూచుని విన‌మ్రంగా బుద్ధిగా వింటున్నాడు. అయితే ఈ స‌న్నివేశం సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు స‌మ‌యంలోనిది కాదు. మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` (2018) సెట్స్ లో ఇది త‌ట‌స్తించింది. వెంకీ ఆన్ లొకేష‌న్ కి వ‌చ్చి మ‌హేష్ ని క‌లుసుకున్న‌ప్పుడు ఏదో చెబుతుంటే అంతే బుద్ధిగా వింటున్నారు మ‌హేష్. ఇలాంటి చిన్నోడు పెద్దోడిని ఆన్ లొకేష‌న్ చూసి ముచ్చ‌ట‌ప‌డ‌ని వాళ్లు ఉంటారా?

వెంకీలోని ఆధ్యాత్మిక కోణం అంటే ప్ర‌తి ఒక్క‌రికి ఎంతో గౌర‌వం. వివేకానందుని సూక్తుల్ని పాటించే హీరో. అలాంటి ఛ‌మ‌క్కులేవైనా చెబుతున్నాడా మ‌హేష్ కి? ఇంత‌కుముందు గోపాల గోపాల టైమ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం వెంకీ వినిపించిన ఆధ్యాత్మిక విష‌యాల్ని ఒంట‌బ‌ట్టించుకున్నాన‌ని అన్నారు.