త్రోబ్యాక్.. ఆలియా బికినీ ఏదో తేడా కొడుతోంది!

Sun Jun 13 2021 11:00:01 GMT+0530 (IST)

Throwback Pic Of Alia Bhatt

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దేశంలోనే క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది ఆలియా భట్. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా ఆర్.ఆర్.ఆర్ లో సీత పాత్రలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మూవీ కోసం ఆలియా 12కోట్లు అందుకుంటోందని ఓవైపు ప్రచారం సాగుతోంది. మరోవైపు కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో గంగూభాయి కతియావాడీ అనే చిత్రంలోనూ నటిస్తోంది. బ్రహ్మాస్త్ర లాంటి భారీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది.ఇక ఆలియా లాక్ డౌన్ అనంతరం ముంబై వీధుల్లో షికార్ కి వెళ్లిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే ఆలియా త్రోబ్యాక్ బికినీ పిక్ ఒకటి బోయ్స్ వాట్సాప్ లో హల్చల్ చేస్తోంది.  నిజానికి ఈ ఫోటోలో బికినీ ధరించి ఎంతో హాట్ గా కనిపిస్తున్నా కానీ తన రూపం గుర్తు పట్టలేనిదిగా ఉంది. ఆలియా కాస్తంత బొద్దుగానే కనిపిస్తోంది ఈ ఫోటోలో. అలాగే ముఖాకృతి పరంగానూ చాలా వేరియేషన్ కనిపిస్తోంది.

మునుపటితో పోలిస్తే ఆలియా లుక్ ఇటీవల పూర్తిగా మారింది. ఇక ఆలియా ఫ్యాషనిస్టాగా ఓ వెలుగు వెలగడమే గాక ఫిట్నెస్ ఫ్రీక్ గానూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆలియా ఫ్లోరల్ బికినీ అంతర్జాలంలో వైరల్ గా మారింది.