#త్రోబ్యాక్: ఇలియానా టెంప్టింగ్ లుక్ వైరల్

Sun Nov 28 2021 08:00:01 GMT+0530 (IST)

Throwback Ileana Tempting Look Viral

సన్నజాజి సోయగం ఇలియానా కెరీర్ జర్నీ ఇటీవల ఒడిదుడుకుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆండ్రూ నీబోన్ తో లవ్ బ్రేకప్ అయ్యాక ఈ బ్యూటీ పూర్తిగా డిప్రెషన్ ని ఫేస్ చేసింది. దాని నుంచి బయటపడేందుకు చాలానే కసరత్తులు చేసింది. కెరీర్ పరంగా బిజీ అయ్యేందుకు జిమ్ లో నిరంతరం శ్రమిస్తూ టోన్డ్ బాడీని ట్రిమ్ చేస్తోంది. చాలా కాలంగా టాలీవుడ్ కి దూరమైనా తరుచూ ఇన్ స్టాలో ఇక్కడ అభిమానులకు కూడా టచ్ లోనే ఉంటుంది. తెలుగు చిత్రాల్లో ఇలియానా ముద్రను అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఇప్పటికీ ఇలియానా నడుము వొంపులు కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి. యోగా సెషన్స్ జిమ్ అంటూ ఆ నడుము ఒంపులను తిరిగి షేపప్ చేసింది.. ఇక ఇన్ స్టాలో ఇలియానా ఫోటోగ్రాఫ్స్ ఇతర నాయికల కంటే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఇటీవల బికినీ ధరించి బోట్ షికార్ ఫోటోలు వైరల్ అయ్యాయి.ప్రస్తుతం ఇలియానా త్రోబ్యాక్ ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్ లో ఇలియానా మారిన లుక్ టోన్డ్ గ్లామ్ హైలైట్ గా నిలిచింది. మైండ్ బ్లాక్ ఇలియానా అంటూ అభిమానులు ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఇలియానా నటవృత్తి విషయానికి వస్తే.. రణదీప్ హుడా సరసన `తేరా క్యా హోగా లవ్లీ` చిత్రంలో నటిస్తోంది. బల్వీందర్ సింగ్ జాను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరో ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేసింది. ఇంకా ఆ వివరాలు బయటకు రాలేదు. ఇక తెలుగులో `దేవదాసు` చిత్రంలో ఇలియానా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.