Begin typing your search above and press return to search.

పిక్ టాక్: ఇద్దరు సూపర్ స్టార్ల మాటామంతి!

By:  Tupaki Desk   |   26 May 2020 11:10 AM GMT
పిక్ టాక్: ఇద్దరు సూపర్ స్టార్ల మాటామంతి!
X
గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా ఖరారు అయిందన్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ నుండి కొత్త సినిమా ప్రారంభం కాలేదు. ఇటీవలే డైరెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ.. తను మహేష్ తో చేయబోయే తదుపరి సినిమా గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు. అంతేకాదు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలిపాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ ఫ్రెష్ ఫేస్ సారా అలీ ఖాన్ నటించబోతుందని ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అయితే సూపర్ స్టార్ పక్కన నటించే హీరోయిన్ గురించి పక్కన పెడితే.. మహేష్ బాబు తన తండ్రి కృష్ణల త్రో బ్యాక్ పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మహేష్ కెరీర్ ప్రారంభంలో దిగినట్లు తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకుకి ఏదో జాగ్రత్తలు చెప్తున్నట్లు తెలుస్తుంది. ఆ ఫోటోలో మహేష్ ఎంతో యంగ్ గా ఉన్నాడు. ఇక కృష్ణ గారి జుట్టు ఇంకా తెల్లబడలేదు. అంటే సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారని అర్ధం అవుతుంది. ఈ పిక్ చూస్తే తండ్రి కొడుకులు ముచ్చటలో మునిగారని అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాను తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున అంటే మే 31న మొదలు పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంన్నాడు మహేష్. కానీ ఇప్పుడు తన జన్మదిన వేడుకలు రద్దు చేసుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. అభిమానులు సైతం వేడుకలు నిర్వహించడం కానీ.. తనను కలవడం కానీ చేయవద్దని చెప్పాడట. అందుకు ప్రధాన కారణం.. ఆయన భార్య విజయ నిర్మల 2019 జూన్ 27న మరణించడం. దాంతో తొలి సంవత్సరీకం పూర్తి కాని నేపథ్యంలో సంతాప సూచకంగా కృష్ణ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రి నిర్ణయాన్ని గౌరవించి మహేష్ తన సినిమాలకు సంబంధించిన ఎలాంటి వేడుకలు కూడా జరపొద్దని ఫిక్స్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా మహేష్ సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తి స్థాయి రొమాంటిక్ ప్రేమకథతో ఈ సినిమా చేయనున్నట్లు సమాచారం.