టీజర్ టాక్: నా పేరు కృష్ణ..నాకో ప్రాబ్లెం ఉంది

Sat Feb 15 2020 11:47:57 GMT+0530 (IST)

Thriller Director Goes For A Naughty Entertainer This Time!

టాలీవుడ్ లో నవతరం ఫిలిం మేకర్లు ఇంట్రెస్టింగ్ కాన్సెప్టులు ఎంచుకుంటూ ఈతరం ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.  'క్షణం' లాంటి విభిన్న చిత్రంతో సూపర్ హిట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు రవికాంత్ పేరెపు తాజాగా 'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే సినిమాతో వస్తున్నాడు.  సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి కలుగుతోంది."నా పేరు కృష్ణ. నాకో ప్రాబ్లెం ఉంది" అంటూ హీరో సిద్దు తన గురించి ఇంట్రో ఇవ్వడంతో టీజర్ ఆరంభం అవుతుంది.  ప్రాబ్లమ్ అనగానే ఈ మధ్య సినిమాల హీరోలకు వింత వింత జబ్బులు ఉంటాయి కదా అలాంటిది కాదని చెప్తాడు.  మరి ఏం ప్రాబ్లెం అనేది తన నోటితోనే చెప్తాడు కానీ మాటల రూపంలో కాదు. ముద్దుల రూపంలో. హీరోయిన్లకు లిప్పు లాకులు కురిపిస్తూ ఉంటాడు. "వాట్ కలర్ ఆర్ యూ వేరింగ్ ఇన్సైడ్"(' ఏ రంగు లోదుస్తులు ధరించావు' అనేది అచ్చతెనుగు అనువాదం). సినిమా టైటిల్ కృష్ణ అని పెట్టారు కాబట్టి మన హీరో అందరితో చిలిపిగా మాట్లాడుతూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. టీజర్ లో కార్ డ్రైవ్ చేస్తూ షాలిని వడ్నికట్టి తో ఫోన్లో మాట్లాడే సీన్ హైలైట్ అని చెప్పాలి.

క్షణం సినిమా ఎంత సీరియస్ గా ఉందో ఈ సినిమా అంత సరదాగా ఉంది. లిప్ లాక్స్.. రొమాన్స్ ఉన్నప్పటికీ టీజర్ మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది.  శ్రద్ధా శ్రీనాథ్.. సీరత్ కపూర్.. షాలిని వడ్నికట్టి ముగ్గురూ అందంతో.. తమ చిలిపిదనంతో స్పందనలు ఉండే ప్రేక్షకుల హృదయస్పందనలను ఆపేలా ఉన్నారు. మరి సిద్దూ కు ఈ అందమైన అమ్మయిలతో ఏం సమస్య వచ్చిందో తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడక తప్పదు. అంతలోపు మాత్రం చూసేయండి.. ఒకేయ్.. ఆ ఆ..!