Begin typing your search above and press return to search.

థియేటర్స్ పూర్వ వైభవం పొందాలంటే ఆ సినిమాలు విడుదల చేయాల్సిందే..!

By:  Tupaki Desk   |   1 Dec 2020 3:30 PM GMT
థియేటర్స్ పూర్వ వైభవం పొందాలంటే ఆ సినిమాలు విడుదల చేయాల్సిందే..!
X
కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ కి దూరమయ్యారు. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే కొత్త సినిమా కోసం ఎదురు చూసే సినీ అభిమానులు.. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ మల్టీప్లెక్సెస్ తెరుచుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. తమిళనాడులో సగభాగం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసి కొత్త సినిమాలను కూడా రిలీజ్ చేశారు. అయితే ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది.

50 శాతం సీటింగ్ కెపాసిటీ కండీషన్ తో విడుదలైన ఈ సినిమాలకు వాటిలో 25 శాతం సీట్స్ మాత్రమే ఫుల్ అయ్యాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో షాక్ తిన్న థియేటర్ ఓనర్స్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ చేస్తే తప్ప హాల్ నిండే అవకాశం లేదని భావిస్తున్నారట. ప్రస్తుతం తమిళనాట కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తే ఎప్పటిలాగే ఆడియన్స్ సినిమా చూడటానికి క్యూ కట్టే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా స్టార్ హీరో సినిమాకి హౌస్ ఫుల్స్ వస్తే కరోనా భయం పోయి మిగతా చిన్న మీడియం రేంజ్ సినిమాలకి కూడా ప్రేక్షకులు వస్తారని అనుకుంటున్నారు.

ఇక టాలీవుడ్ విషయానికొస్తే డిసెంబర్ 25న థియేటర్స్ లోకి రావడానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ముందుకొచ్చాడు. తాజాగా ఆయన నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ వస్తే మాత్రం మిగతా సినిమాలన్నీ థియేటర్స్ కి లైన్ కట్టే అవకాశం ఉంది. దీని రిజల్ట్ ఎలా ఉన్నా మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్'.. రామ్ పోతినేని 'రెడ్'.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' వంటి సినిమాలు జనాలను థియేటర్స్ కి రప్పించగలవని సినీ జనాలు నమ్ముతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.