Begin typing your search above and press return to search.

ఈసారి కల్లు గ్లాస్ తో.. సునీత ఏం చేసినా ట్రెండ్డింగ్‌

By:  Tupaki Desk   |   6 March 2021 3:30 AM GMT
ఈసారి కల్లు గ్లాస్ తో.. సునీత ఏం చేసినా ట్రెండ్డింగ్‌
X
సింగర్ సునీత ఈమద్య కాలంలో రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ లో ఉంటున్నారు. పెళ్లికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా సునీత గురించిన ఏదో ఒక విషయం లేదా ఆమె పెళ్లి చేసుకున్న రామ్ వీరపనేని గురించిన విషయాలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కొత్త జీవితంను చాలా ఆనందంగా ఎంజాయ్‌ చేస్తున్న సునీత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారు. ఇన్నాళ్లు ఆమె మొహం లో లేని సంతోషం ఇప్పుడు కనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సునీత మరో సారి ట్రెండ్డింగ్‌ లో నిలిచింది.

సునీత ఈసారి కల్లు గ్లాస్‌ చేతిలో పట్టుకుని ఉన్న ఫొటో వైలర్ అవుతోంది. కల్లు తాగిందో లేదో కాని కల్లు గీత కార్మికుడితో కలిసి సునీత మరియు మరో మహిళ కల్లు గ్లాస్ పట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. తాటి చెట్టు కింద కూర్చుని నిజంగా పాలు తాగినా కూడా దాన్ని కల్లే అంటారు అనే సామెత ఉంది. కనుక గీత కార్మికుడు పక్కన ఉండగా చేతిలో కల్లు గ్లాస్ ఉండటం వల్ల సునీత కల్లు తాగే ఉంటుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

సునీత ను ఈసారి కల్లు గ్లాస్ ట్రెండ్డింగ్ లో ఉంచింది. సరదాగా తీసుకుందా నిజంగానే సునీత కల్లు తాగారా అనే విషయం ఆమె నోరు విప్పితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఆరోగ్యంకు చాలా మంచిది అయిన తాటి కల్లు తాగడం తప్పేం కాదని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం కల్లును ప్రమోట్‌ చేసేలా సునీత గారు ఏంటీ ఈ ఫొటో పోజులు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.