ఈ టైమ్ లో ఛాన్స్ ఇస్తే.. చిరు సూపర్ అన్నట్టే..!

Tue Jan 24 2023 11:28:31 GMT+0530 (India Standard Time)

This time Chiru also said OK to Puri's request

ఆచార్య గాడ్ ఫాదర్ సినిమాలు నిరాశపరచగా వాల్తేరు వీరయ్యతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అభిమాని దర్శకుడైతే చిరుని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించి సూపర్ హిట్ కొట్టేశాడు డైరెక్టర్ బాబీ. వాల్తేరు వీరయ్యలో చిరుతో పాటుగా రవితేజ ఎనర్జీ సినిమాకు ప్లస్ అయ్యింది. చిరునే ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కీలకం ఆయన వల్లే ఈ సక్సెస్ అని కూడా అన్నారు.ఇదిలా ఉంటే చిరు నెక్స్ట్ భోళా శంకర్ చేస్తున్నారు. ఆ సినిమా విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ రోల్ లో నటిస్తుంది.

తమన్నా ఫిమేల్ లీడ్ గా చేస్తుంది. ఈ సినిమా తర్వాత చిరు ఇద్దరు ముగ్గురు దర్శకులతో కథా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చిరుతో పూరీ ఎప్పటి నుంచో సినిమా చేయాలని చూస్తున్నాడు. కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు.

ఆటో జానీ అంటూ చిరు కోసం పూరీ జగన్నాథ్ ఒక కథ రాయగా ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నా సెకండ్ హాఫ్ బాగాలేదని పూరీకి నో చెప్పారు చిరంజీవి. అయితే ఈ మధ్య గాడ్ ఫాదర్ సినిమాలో పూరీకి ఒక పాత్ర ఇచ్చారు.

సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేసిన పూరీ ఆ టైం లో చిరుతో సినిమా కోసం మరోసారి ప్రయత్నించారట. ఈసారి చిరు కూడా పూరీ రిక్వెస్ట్ కి ఓకే చెప్పినట్టు టాక్. మంచి కథ ఉంటే పట్టుకురా అని చెప్పారట చిరు.  

దానితో ఆటో జానీ కథని పక్కన పెట్టి మెగాస్టార్ కోసం మరో అద్భుతమైన కథ రాసుకున్నాడట పూరీ. లైగర్ ఫ్లాప్ తో పూరీ డీలా పడగా ఈ టైం లో మెగాస్టార్ ఛాన్స్ ఇస్తే మాత్రం ఆ లెక్క వేరేగా ఉంటుందని చెప్పొచ్చు. పూరీ కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెగా అవకాశం వస్తే మరోసారి తన ఒరిజినాలిటీ బయటకు తీసి సినిమా చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ కాంబో ఆడియన్స్ లో ఆసక్తి కలుగచేస్తుంది. మరి ఈ కలయికలో సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.