బాలీవుడ్ లో సౌత్ మూవీస్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

Tue May 24 2022 19:00:01 GMT+0530 (IST)

This is the secret of South Movies success in Bollywood

పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా సక్సెస్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ క్రష్ గా కూడా క్రేజ్ అందుకుంటోంది. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో మంచి డిమాండ్ ఏర్పడింది.చూస్తుంటే భవిష్యత్తులో బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. అయితే రష్మిక మందన్న మాత్రం బాలీవుడ్ కి వెళ్ళినా కూడా సౌత్ సినిమాలకు ఏ మాత్రం వదిలేలా లేదు అనిపిస్తుంది.

ఎందుకంటే ప్రస్తుతం సౌత్ సినిమాలకు బాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ తరహాలో మార్పు ఎలా జరిగింది సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నారు అనే విషయంపై కూడా ఈ బ్యూటీకి ఒక క్లారిటీ ఉంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో రష్మిక మందన్న సౌత్ సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ రావడానికి గల కారణం కూడా వివరించింది.

ఇటీవల కాలంలో పుష్ప  కేజిఎఫ్ చిత్రాలు బాలీవుడ్ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి అంటూ అక్కడి ప్రేక్షకులు మన సినిమాలను ఎంతగానో ఇష్టపడుతున్నారు అని అయితే దీని వెనుక కంటెంట్ తో పాటు మరొక కారణం కూడా ఉందని తెలిపింది.

అదేమీ ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పు కాదు అని.. ఇది ఎప్పటినుంచో కొనసాగుతోందని రష్మిక చెప్పుకొచ్చింది. రీసెంట్ గా నేను ఒక సినిమా షూటింగ్ కోసం నార్త్ కి వెళ్ళినప్పుడు అక్కడ సాధారణ జనాలతో మాట్లాడడం జరిగిందని వివరణ ఇచ్చింది.

'ఎందుకు అంతగా సౌత్ సినిమాల్లో ఇష్టపడుతున్నారు అని వారిని అడగడంతో అప్పుడు వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు. తాము ఇప్పటి నుంచి సౌత్ సినిమాలను చూడడం లేదు అని ఇంతకుముందు టీవీలలో కూడా చాలా ఇష్టంగా చూసే వాళ్ళం అని ఇప్పుడు థియేటర్లలో ఇంకా బావుందని చెప్పారు. అంతే కాకుండా సంస్కృతి ఆచారాలను కూడా పర్ఫెక్ట్ గా చూపించడంతో అక్కడ జనాలు ఎక్కువగా సౌత్ మూవీస్ కు ఎట్రాక్ట్ అయ్యారు' అని రష్మిక మందన్న వివరణ ఇచ్చింది.