ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నెం.1 గా ఉండటానికి కారణం ఇదే..!

Tue May 04 2021 07:00:01 GMT+0530 (IST)

This is the reason why Mega Compound is No.1 in the industry

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగైదు ఫ్యామిలీ హీరోల హవా నడుస్తోంది. స్వయంకృషితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి టాప్ హీరో స్థాయికి ఎదిగిన చిరంజీవి అండతో ఇప్పటి వరకు మొత్తం డజను మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు.. నందమూరి ఫ్యామిలీ నుంచి నలుగురు.. దగ్గుబాటి - ఘట్టమనేని హీరోలు కలిపి నలుగురు ఉన్నారు. అయితే ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా ఎంతమంది ఉన్నా మెగా ఫ్యామిలీ హీరోల హవా కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.మెగా కాంపౌండ్ నెంబర్ వన్ గా ఉండటానికి మిగతా కాంపౌండ్స్ అన్నీ అంతగా పేరు తెచ్చుకోలేకపోవడానికి అసలు కారణం వారందరూ యూనిటీగా ఉండటమే అని సినీ అభిమానులు అంటున్నారు. మెగా హీరోలు లోపల ఎలా ఉన్నా.. బయటకు మాత్రం వీరంతా చాలా యూనిటీగా ఉన్నట్లుగా కవరింగ్ చేస్తుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. నిజానికి మెగాలో స్టార్ హీరోలకు పడటం లేదని ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవి ఎప్పుడూ బయటపడలేదు. ఒకరి సినిమా విడుదలైతే మిగతా హీరోలంతా తమ వంతుగా దాన్ని ప్రమోట్ చేస్తూ తమ బాధ్యతగా ఫీల్ అవుతుంటారు. అలానే వారిపై ఏదైనా ఇష్యూ వచ్చినా అందరూ ఒకరికొకరు మద్ధతుగా నిలుస్తూ ముందుకు వెళ్తుంటారు.

అయితే ఇండస్ట్రీలో మిగతా ఫ్యామిలీలలో ఇది మిస్ అవుతూ ఉంటుంది. మెగా కాంపౌండ్ తరువాత అక్కినేని కుటుంబంలో ఈ యూనిటీ కనిపిస్తూ ఉంటుంది. మెగా హీరోల స్థాయిలో కాకపోయినా అప్పుడప్పుడు ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. దగ్గుబాటి హీరోలు కూడా ఆ విషయంలో పర్వాలేదు. కాకపోతే నెపోటిజం హీరోలని జనాల నుంచి విమర్శలు వస్తాయనో ఏమో మెగా హీరోలు చేసిన రేంజ్ లో అయితే ఒకరినొకరు ప్రమోట్ చేసుకోవడం లేదు. ఇక నందమూరి ఫ్యామిలీలో మాత్రం యూనిటీ ఉండదని.. వారి మధ్య పొరపొచ్చులు ఉన్నాయ విషయం ఓపెన్ సీక్రెట్ అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉంటుంది.

అన్నదమ్ములు కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నా.. బాబాయ్ బాలయ్య మాత్రం వీరికి కాస్త దూరంగా ఉంటారనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. వీరు కూడా ఇతర కాంపౌండ్ హీరోల మాదిరిగా యూనిటీగా ఉంటే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంటారనేది నందమూరి అభిమానుల అభిప్రాయం. మరి త్వరలోనే నందమూరి హీరోలందరూ కలిసి ఓ సినిమా చేసి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిరూపిస్తారేమో చూడాలి.