నితిన్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈ ప్రయోగం

Tue Sep 14 2021 15:03:54 GMT+0530 (IST)

This is the first time in Nitin career

యంగ్ హీరో నితిన్ కరోనా కాలం లో కూడా రెగ్యులర్ గా సినిమాలను విడుదల చేశాడు. గత ఏడాది భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ ఏడాది చెక్ మరియు రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ వారంలో మాస్ట్రో సినిమాతో ఓటీటీ ద్వారా రాబోతున్నాడు. ఇక వచ్చే ఏడాదికి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నితిన్ రెడీ చేస్తున్నాడు. తాజాగా వినాయక చవితి సందర్బంగా నితిన్ కొత్త సినిమా టైటిల్ ను 'మాచర్ల నియోజక వర్గం' గా ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి ఎంఎస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని నటింపజేస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అనే వార్తలు మొదట వచ్చాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.నితిన్ కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ఒక పక్కా ఫుల్ లెంగ్త్ పొలిటికల్ డ్రామాను ఈ సినిమాలో చూపించబోతున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా కథ పూర్తిగా రాజకీయం చుట్టు తిరుగుతుందట. ఈమద్య కాలంలో టాలీవుడ్ లో కూడా ఇలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా వచ్చిందే లేదని.. అందుకే ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. నితిన్ పొలిటీషియన్ ఆ కనిపిస్తాడని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మరో రకంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఒక మాస్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడని ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది.

సినిమాలో నితిన్ ఏంటీ.. కథ ఏంటీ అనే విషయాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. కనుక సినిమా ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకునేలా స్క్రీన్ ప్లే మరియు నితిన్ పాత్ర ఉంటుందని యూనిట్ సభ్యుల్లో కొందరు అంటున్నారు. నితిన్ మరియు కృతి శెట్టిల మద్య లవ్ ట్రాక్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి పొలిటికల్ డ్రామాగా నిలుస్తుందని మేకర్స్ అంటున్నారు. కథ విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నితిన్ స్వయంగా ఈ సినిమాను తన హోమ్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు సోదరి నిఖిత రెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను శ్రేష్ఠ్ మీడియా బ్యానర్ లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కు మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.