Begin typing your search above and press return to search.

RRR స‌క్సెస్ వెనుక‌ ఎన్టీఆర్ క‌నెక్ష‌న్ ఇదీ

By:  Tupaki Desk   |   25 Jan 2022 6:30 AM GMT
RRR స‌క్సెస్ వెనుక‌ ఎన్టీఆర్ క‌నెక్ష‌న్ ఇదీ
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి అభిమాన న‌టుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి బ‌హిరంగంగా చాలాసార్లు చెప్పారు. న‌ట‌న విష‌యంలో తార‌క్ త‌న‌ని మెప్పించిన‌ట్లుగా ఏ న‌టుడు ఇంత‌వ‌ర‌కూ మెప్పించ‌లేద‌ని చెప్పిన సంద‌ర్భాలున్నాయి.

తార‌క్ గురించి గొప్ప‌గా వ‌ర్ణించే ద‌ర్శ‌కుడు కూడా జ‌క్క‌న్న కావ‌డం విశేషం. ఇలా తార‌క్ గురించి జ‌క్క‌న్న మాట‌ల్లో చెప్ప‌లేనంత అభిమానం చూపిస్తారు. తార‌క్ ని ఎప్పుడు ది బెస్ట్ న‌టుడిగా చూడాల‌నుకుంటారు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ప‌రిచ‌యం చేయ‌డానికి జ‌క్క‌న్న త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌తో తెర‌కెక్కించిన ` ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాని బాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఇదే ఎంట్రీ మూవీ. ఇక ఎన్టీఆర్- రాజ‌మౌళి కాంబినేష‌న్ లో 18 ఏళ్ల‌ త‌ర్వాత వ‌స్తోన్న చిత్ర‌మిది. ఇందులో తార‌క్ స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు కొమ‌రం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ పాత్ర ఎంత ప‌వ‌ర్ పుల్ గా ఉంటుందో ఇప్ప‌టికే రివీల్ అయింది. అంచ‌నాలు అదే స్థాయిలో ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి తార‌క్ ని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. దీంతో `ఆర్ ఆర్ ఆర్` పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయే కానీ త‌గ్గ‌లేదు.

ఒక ఈవెంట్ లో రాజ‌మౌళి మాట్లాడుతూ.. ``ఎన్టీఆర్ తో ఎప్పుడు సినిమాచేసినా అది ఎన్టీఆర్ బెస్ట్ బిగ్గెస్ట్ సినిమా కావాల‌ని..అలాంటి స‌బ్జెక్ట్ కోసం ఎంత కాలం అయినా వెయిట్ చేస్తాన‌ని తార‌క్ పై త‌న అభిమానాన్ని మ‌రోసారి చాటే ప్ర‌య‌త్నం చేసారు.

`ఆర్ ఆర్ ఆర్` అలాంటి స్క్రిప్ట్ అని రాజ‌మౌళి మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డింది. తార‌క్ హిందీ లో నేరుగా సినిమాలు చేస్తే ఆర్ ఆర్ ఆర్ స‌క్సెస్ అత‌నికి మంచి జోష్ ఇస్తుంద‌న్న ధీమా తార‌క్ మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డింది.

తార‌క్ కి బాలీవుడ్ మార్కెట్ చాలా అవ‌స‌రం ఇప్పుడు. అది తాను ఇస్తాన‌న్న ధీమా రాజ‌మౌళి మాట‌ల్లో క‌నిపించింది. ఇక్క‌డ తార‌క్ తో పాటు చ‌ర‌ణ్ కి ఈ మూవీ ఎంతో కీల‌కం. చ‌ర‌ణ్‌ కి బాలీవుడ్ మార్కెట్ ని బిల్డ్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ `జంజీర్` రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచ‌నాల్ని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.