Begin typing your search above and press return to search.

90ల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ లు ఇలా ప్ర‌త్య‌క్షం

By:  Tupaki Desk   |   18 Jun 2021 12:30 AM GMT
90ల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ లు ఇలా ప్ర‌త్య‌క్షం
X
90ల‌లో న‌గ్మ‌ను అరేబియ‌న్ గుర్రం అంటూ అభిమానులు పొగిడేసేవారు. ర‌మ్య‌కృష్ణ అప్ప‌ట్లో టాప్ హీరోయిన్ గా సంచ‌ల‌న విజ‌యాల్లో న‌టించారు. మీనా క్లాసిక్ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి - మీనా కాంబినేష‌న్ .. మెగాస్టార్ చిరంజీవి- న‌గ్మ కాంబినేష‌న్ .. మెగాస్టార్ చిరంజీవి - ర‌మ్య‌కృష్ణ కాంబినేష‌న్.. 90ల‌లో ఎంత పాపుల‌రో తెలిసిందే.

మీనా - న‌గ్మ‌- ర‌మ్య‌కృష్ణ లాంటి క‌థానాయిక‌ల‌తో కింగ్ నాగార్జున రొమాన్స్ కూడా అప్ప‌ట్లో అంతే పాపుల‌ర్.. స‌ద‌రు నాయిక‌ల‌తో నాగ్ కాంబినేష‌న్ లో బంప‌ర్ హిట్లు వ‌చ్చాయి. చిరు.. నాగార్జున‌ల‌తో క‌లిసి స‌ద‌రు క‌థానాక‌లు ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లో న‌టించారు.

చిరంజీవి స‌ర‌స‌న ఘ‌రానామొగుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో న‌గ్మ‌ న‌టించారు. నాగార్జున స‌ర‌స‌న వార‌సుడొచ్చాడు- కిల్ల‌ర్ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌గ్మ న‌టించారు. ఇక ర‌మ్య‌కృష్ణ చిరంజీవి స‌ర‌స‌న ముగ్గురు మొన‌గాళ్లు స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించ‌గా.. నాగార్జున స‌ర‌స‌న హ‌లోబ్ర‌ద‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించారు. ఇటీవ‌ల సోగ్గాడే చిన్ని నాయ‌నాలోనూ ర‌మ్య‌కృష్ణ క‌థానాయిక‌గా న‌టించారు. నాగార్జున‌తో మీనా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో నాయిక‌గా ఆడిపాడారు.

నాటి రోజుల‌కు జ్ఞాప‌కంగా క్లాసిక్ అన‌ద‌గ్గ ఫోటోగ్రాఫ్ తాజాగా అంత‌ర్జాలంలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. 90ల‌లో అగ్ర హీరోలు చిరంజీవి- నాగార్జున .. ఆ ఇద్ద‌రి స‌ర‌స‌నా న‌టించిన అందాల క‌థానాయిక‌లు న‌గ్మ‌-మీనా-ర‌మ్య ఈ క్లాసిక్ ఫోటోగ్రాఫ్ లో ఒకే ఫ్రేమ్ లో క‌నిపించ‌డంతో అభిమానులు దీనిని వైర‌ల్ చేస్తున్నారు.