అమితాబ్ కు కరోనా ఇలా వచ్చిందంటున్నారు

Sun Jul 12 2020 15:00:49 GMT+0530 (IST)

This is how Corona came to Amitabh

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్ధారణ అవ్వడంతో దేశం మొత్తం కూడా షాక్ అవుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీ.. అందరికి జాగ్రత్తలు చెప్పే అమితాబ్ కు ఎలా వైరస్ అంటుకుని ఉంటుంది అంటూ అంతా ఆలోచనల్లో పడ్డారు. లాక్ డౌన్ నుండి ఇంటినుండి బయటకు వెళ్లని బచ్చన్ కు ఎలా కరోనా సోకి ఉంటుంది అనేది అందరి అనుమానం.ప్రస్తుతం ఈ విషయమై ఒక ఆసక్తి కర విషయం చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ కోసం ఆడిషన్స్ జరిగాయి. అందుకు సంబంధించి ముంబయి లోని ఒక స్టూడియోకు అమితాబ్ వెళ్ళాడు. ఆ సమయంలో మాస్క్ ధరించే ఉన్నాడు. అయినా కూడా ఆయనకు అక్కడికి వెళ్లిన సమయంలోనే ఆయనకు వైరస్ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి నుండి అభిషేక్ కు వచ్చి ఉంటుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలా జరిగినా ప్రస్తుతం కరోనా నుండి వెంటనే అమితాబ్ కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.