Begin typing your search above and press return to search.

చెర్రీ - బుచ్చి ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ పాత్ర ఇదే..?

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:00 AM GMT
చెర్రీ - బుచ్చి ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ పాత్ర ఇదే..?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎట్టకేలకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ హీరోతో సెట్ చేసుకుని వార్తల్లో నిలిచాడు బుచ్చి.

నిజానికి ఉప్పెన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి బుచ్చిబాబు ప్రయత్నాలు చేశాడు. తారక్ కు స్టోరీ లైన్ చెప్పి మెప్పించి, గత కొన్ని నెలలుగా స్క్రిప్టు మీద వర్క్ చేశాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.

తారక్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ ని చరణ్ ఓకే చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. అయితే చెర్రీ - బుచ్చి ప్రాజెక్ట్ సెట్ అవ్వడం వెనుక ఎన్టీఆర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్ RRR తర్వాత కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ లతో సినిమాలు సైన్ చేశాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మధ్యలో బుచ్చిబాబు మూవీ కూడా ఉండాల్సింది. కాకపొతే కొరటాల ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. తారక్ తో సినిమా చేయాలంటే బుచ్చి చాలా కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

అందుకే మరో హీరోతో ముందుకు వెళ్లాల్సిందిగా బుచ్చి బాబుకి సూచించారు ఎన్టీఆర్. దీంతో రామ్ చరణ్ ను కలిసి స్క్రిప్ట్ వినిపించాడు బుచ్చి. అయితే ఈ విషయాన్ని ముందుగా తారక్ తో చర్చించిన తర్వాతే చరణ్ కథ విన్నాడని టాక్. ఈ క్రమంలో చెర్రీ కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేశారని అంటున్నారు.

RRR సినిమాలో అద్భుతమైన స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ మరియు రాంచరణ్.. రియల్ లైఫ్ లోనూ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పరస్పరం చర్చించుకొని, ఒకరికి నచ్చిన స్క్రిప్టుని మరొకరు చేయడం వారి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ని తెలియజేస్తుంది.

చరణ్ ప్రస్తుతం RC15 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కొత్త షెడ్యూల్ ఇటీవల న్యూజిలాండ్ లో ప్రారంభమైంది. వచ్చే యేడాది జనవరిలో బుచ్చిబాబు చిత్రాన్ని పట్టలెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

RRR సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత చరణ్ - తారక్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. దీంతో ఇప్పుడు వారి తదుపరి చిత్రాలపై అందరి దృష్టి పడింది. మరి ఈ సినిమాలతో స్టార్ హీరోలిద్దరూ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.