ఈ గ్లామర్ బ్యూటీ 'వెబ్ సిరీస్' పై భారీ ఆశలే పెట్టుకుందట..!

Mon Jun 14 2021 13:00:01 GMT+0530 (IST)

This glamorous beauty has high hopes for the 'web series' ..!

కరోనా పరిస్థితి నెలకొన్నప్పటి నుండి సినీరంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా మార్పులు జరిగాయి. కరోనా సమయంలో సినీ రంగం మాత్రమే మార్పు చెందిందని చెప్పుకోవచ్చు. అందులోను టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోలు అయిపోవడం.. యాంకర్స్ హీరోయిన్స్ అయిపోవడం.. మొన్నటివరకు ఖాళీగా ఉన్న హీరోయిన్స్ బిజీ అయిపోవడం ఇలా ఎన్నో మార్పులు చూస్తున్నాం. అయితే ఇంతమంది వివిధ రకాలుగా బిజీ అవుతున్నారు అంటే  కారణం ఓటిటిలు. దేశంలో కరోనా మొదలైనప్పుడే ఓటిటిల వాడకం కూడా పెరిగింది.గతేడాది ముందువరకు ఓటిటి అంటే.. థియేటర్లలో ఆడిన సినిమాలు ఓటిటిలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం కొత్త సినిమాలు - వెబ్ సిరీసులు కూడా నేరుగా ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటిటిలకు అలవాటు పడిన ప్రేక్షకులు కూడా ఎలాగో థియేటర్స్ ఓపెన్ లేవు కదా సినిమాలు ఓటిటి రిలీజ్ చేయాలనీ ఇష్టపడుతున్నారు. అయితే ఈ క్రమంలో స్టార్ హీరోలు - హీరోయిన్స్ ఓటిటి మూవీస్ - వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు.

ఆల్రెడీ తెలుగులో హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న మోడల్ - బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు - వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయింది. పదేళ్లుగా ఇండస్ట్రీలో యాక్ట్రెస్ గా కంటిన్యూ అవుతున్న నందిని.. ఇప్పటివరకు హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. అయితే ఇటీవలే ఆహా కోసం 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్.. "ఐ.ఎన్.జి" అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది. ఇప్పటికే షూట్ అవుట్ ఎట్ ఆలేరు - మెట్రో కథలు వెబ్ సిరీస్ లలో నటించింది.

అయితే ఇప్పటివరకు నందిని మాక్సిమం అన్ని గ్లామరస్ బోల్డ్ రోల్స్ చేసింది. తాజాగా కమెడియన్ ప్రియదర్శి - నందిని రాయ్ కాంబినేషన్ లో ఓ సస్పెన్సు థ్రిల్లర్ 'ఐ.ఎన్.జి' వెబ్ సిరీస్ సిద్ధం అయింది. సీనియర్ స్టార్ డైరెక్టర్ సురేష్ కృష్ణ నిర్మాతగా మారి ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ వెబ్ సిరీస్ తో నందిని కెరీర్ ఊపు అందుకుంటుందేమో.. అలాగే కోతికొమ్మచ్చి అనే సినిమాలో నందిని ఐటమ్ సాంగ్ కూడా చేసింది. మొత్తానికి ఈ తెలుగు బ్యూటీ వెబ్ సిరీస్ ద్వారా కెరీర్ ప్లానింగ్ చేసుకుంటుంది.