ఫోటో స్టోరి: బుట్టబొమ్మను మరిపించే పుత్తడి బొమ్మవే

Sun Oct 18 2020 17:40:28 GMT+0530 (IST)

This angle in the Raashi Khanna is just Never before

పొడుగు కాళ్ల సొగసును ఎరవేస్తూ పిక్కల పైకి మిడ్డీ వేసింది అల పూజా హెగ్డే. బుట్టబొమ్మ అంటూ తెగ కీర్తించేశారు లిరిసిస్ట్. మాటల మాంత్రికుడి మాయలు బాగానే వర్కవుట్ అయ్యాయి. బాపు తయారు చేసిన బుట్టబొమ్మ రూపాన్ని వేరే ఊహించుకున్నా.. ఇక్కడ మోడ్రన్ బుట్టబొమ్మను గొప్పగా చూపించిన ఘనత త్రివిక్రమునికే చెల్లుతుంది.అన్నట్టు బుట్టబొమ్మను మించిన పుత్తడి బొమ్మ దర్శనమిచ్చింది ఇదిగో. ఇక్కడ రాశీ ఖన్నా కొత్త లుక్ చూశాక మాయావికి అయినా మతి చెడాల్సిందే. బుట్టబొమ్మను వదిలేసి ఇదిగో పుత్తడి బొమ్మ రాశీ వెంట పడతాడేమో! అన్నంతగా కైపెక్కించేస్తోందిగా.

దిల్లీ బ్యూటీ రాశీఖన్నా హైదరాబాద్ లో సెటిలయ్యాక తెలుగమ్మాయి బుద్ధులే అబ్బేసాయ్. అచ్చ తెలుగు అమ్మాయిలా ఎంతందంగా ఒదిగిపోయిందో ఆ చీరకట్టులో. బొడ్డుకింద దోపి మనుసు నిలువు దోపిడీ చేసేస్తోంది. ఎంకి మావ పాలిట సుబ్బిలాగా ఎంతందంగా ఉందో! కోక రవికెలోనే సుబ్బలక్ష్మిలాగా.. జడలో పూలు తురిమిన చింతామణిలాగా ఉంది మరి. ఇక రాశీని ఇలా చూశాక కుర్రకారు కంటికి కునుకు కరువవ్వకుండా ఉంటుందా మరి?