ఇలియానాకు ఆ హీరో దేవుడు అయ్యాడుగా..!

Mon May 25 2020 17:00:01 GMT+0530 (IST)

This Star Actor Supporting Ileana From Back

ఇలియానా సౌత్ నుండి బాలీవుడ్ కు వలస వెళ్లి అక్కడ సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో మొదటి రెండు మూడు సంవత్సరాలు చాలా బిజీగా గడిపిన ఈ అమ్మడు ఈమద్య కాలంలో ఆఫర్లు అందుకోవడమే గగనం అయ్యింది. ఇలాంటి సమయంలో ఈ అమ్మడికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇలియానా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో గతంలో కూడా అజయ్ దేవగన్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఇలియానకు అజయ్ ఛాన్స్ ఇచ్చి ఆమెకు దేవుడిగా మారాడు.ఇలియానా.. అజయ్ దేవగన్ లు నటించిన బాద్ షాహో మరియు రైడ్ సినిమాల్లో ఒకటి సక్సెస్ అవ్వగా మరోటి నిరాశ పర్చింది. వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే ఖచ్చితంగా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇలియానాను మొదటి నుండి ప్రోత్సహిస్తూనే వస్తున్న అజయ్ దేవగన్ మరోసారి ఆమెకు ఛాన్స్ ఇవ్వడంతో అంతా కూడా ఇద్దరి మద్య స్నేహం చాలా దూరం వెళ్లింది అంటూ గుసగుసలాడుతున్నారు.

అజయ్ దేవగన్ నటించిన టోటల్ ధమాల్ చిత్రంలో కూడా ఇలియానాను తీసుకోవాలని భావించారట. కాని మేకర్స్ అజయ్ దేవగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో కాస్త చర్చ జరిగిందని ఈసారి మాత్రం ఇలియాను తీసుకునేలా గట్టిగానే ఆయన పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సమయంలో ఇలియానకు దేవుడి మాదిరిగా అజయ్ దేవగన్ అవకాశాలు ఇస్తూ ఆదుకుంటున్నాడు.