ఈ అమ్మాయికి మంచి ఆఫర్లు వస్తున్నాయి!

Tue Jun 25 2019 16:53:42 GMT+0530 (IST)

ఒక హీరోయిన్ కెరీర్ జోరుగా కొనసాగాలంటే మాంచి హిట్లు తగలాల్సిందే.  అలా హిట్లు రాకపోతే మాత్రం కెరీర్ స్లో అయిపోతుంది. అందం ఉన్నా.. టాలెంట్ ఉన్నా హీరోయిన్లకు సక్సెస్ చాలా ముఖ్యం. ప్రస్తుతం మేఘా ఆకాష్ పరిస్థితి మాత్రం అలా లేదు.  హిట్స్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.   నితిన్ హీరోగా నటించిన 'లై'.. 'ఛల్ మోహన్ రంగా' సినిమాల్లో మేఘ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల తర్వాత మేఘ కోలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఈ ఏడాది రజనీకాంత్ 'పేట' సినిమా తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది.నిజానికి ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎనై నోకి పాయుం తోటా' మేఘ కు ఫిలిం డెబ్యూ కావాల్సింది. ఆ సినిమా చాలా రోజుల నుండి రిలీజ్ కాకుండా ల్యాబ్స్ లోనే ఉంది. దీంతో నితిన్ 'లై' మేఘకు ఫిలిం ఇండస్ట్రీలో మొదటి సినిమాగా మారింది.. కోలీవుడ్ లో 'పేట' డెబ్యూ అయింది. ఇదిలా ఉంటే మేఘకు తాజాగా కోలీవుడ్లో ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది.  కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా వెంకట్ కృష్ణ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా లాంచ్ అయిందని సమాచారం.  ఈ సినిమాలోనే మేఘకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందట.  ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాలపై ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ఉంటోంది.

ఈ సినిమా కాకుండా మేఘ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.  తెలుగులో 'మను చరిత్ర'.. హిందీలో 'శాటిలైట్ శంకర్' సినిమాలలో నటిస్తోంది.  వీటితో పాటు తమిళంలో 'ఒరు పక్క కథై' అనే సినిమా కూడా ఉంది.  ఏదైతేనేం.. తెలుగు.. తమిళం.. హిందీ భాషలు  అన్నీ కవర్ చేస్తూ ప్యాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకునే దిశగా సాగిపోతోంది.