`తిరు` ట్రైలర్ టాక్: ఫుడ్ డెలివరీ బాయ్ కష్టాలు!

Sat Aug 13 2022 18:35:13 GMT+0530 (India Standard Time)

Thiru Official Trailer Telugu Dhanush

విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు తమిళ హీరో ధనుష్. తెలుగులో `సార్` సినిమా చేస్తున్న ధనుష్ మరో తమిళ సినిమాతో తమిళ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధనుష్ నటించిన లేటెస్ట్ తమిళ మూవీ `తిరు చిత్రాంబళం`. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు.రాశీఖన్నా నిత్యమీనన్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ లుగా నటించారు. సీనియర్ దర్శకుడు భారతీ రాజా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీని తెలుగులో `తిరు` పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు అనువాద హక్కుల్ని ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఆగస్టు 18న ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయాబోతున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ని శనివారం చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ మూవీని ఓ ఫుడ్ డెలివరీ బాయ్ స్టోరీగా తెరకెక్కించారు. ధనుష్ ఇందులో తిరు ఏకాంబరంగా అలియాస్ పండు అనే నిక్ నేమ్ వున్న ఫుడ్ డెలివరీ బాయ్ గా నటించాడు. చైల్డ్ హుడ్ ఫ్రెండ్ గా నిత్యామీనన్ క్లాస్ మేట్ అండ్ లవర్ గా రాశిఖన్నా ఎక్స్ లవర్ గా ప్రియా భవానీ శంకర్ కనిపించారు. `ఏయ్ పండూ నీ ఆర్డర్ రెడీ అయింది.. ఎంత సేపని పిలవాలి.. ` అంటూ ఓ వాయిస్ తో ఈ మూవీ ట్రైలర్ మొదలైంది.

నాది చాలా సింపుల్ లైఫ్ 9 టూ 6 స్పూత్ గా వర్క్.. వీకెండ్ అంటే ఏదో సినిమా..టీవీ.. నెట్ ఫ్లిక్స్ చూసుకునే మామూలు జీవితం` అని ధనుష్ చెప్పడం.. వస్తూ వస్తూనే నాలుగు బీర్లు తీసుకురా అని తాత పాత్రలో నటించిన భారతీరాజా ఆర్డర్ వేయడం నవ్వులు పూయిస్తోంది.

ఇలాంటి యువకుడి జీవితంలో ముగ్గురు అమ్మాయిలు. అందులో ఇద్దరు రాశీఖన్నా.. క్లాస్ మేట్ (అనూష).. ప్రియా భవానీ శంకర్ (రజనీ) ఎక్స్ గాళ్ ఫ్రెండ్..  ఒకరు నిత్యామీనన్..(శోభన) చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరు అమ్మాయిల్లో తన స్నేహితురాలు శోభన సలహా మేరకు తిరు ఎవరిని ప్రేమించాడు?.. చివరికి తిరు జీవితం ఎలా సుఖాంతమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీ ఓంకార్ ఎడిటింగ్ ప్రసన్న జీకె.