క్షణక్షణం ఉత్కంఠ! గుహలో ఆ పదముగ్గురిని కాపాడేదెలా?

Tue Jul 05 2022 18:05:15 GMT+0530 (India Standard Time)

Thirteen Lives Trailer

రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో కాన్సెప్ట్ అంటే ఎంతో ఉత్కంఠను పెంచుతుంది. ఇంతకుముందు టనెల్- రెస్క్యూ- వర్టికల్ లిమిట్ లాంటి అడ్వెంచర్ రెస్క్యూ మూవీస్ ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. గగుర్పొడిచే సాహసాలకు ఆస్కారం ఉన్న బ్యాక్ డ్రాప్ ని ఎంచుకుని ప్రయోగాత్మకంగా వచ్చిన సినిమాలు చాలా ఉన్నా ఇప్పుడు కిలోమీటర్ల పొడవున ఉన్న సొరంగం నుంచి ఆ పదముగ్గురిని కాపాడే సాహసాలు ఓటీటీ- థియేట్రికల్ వీక్షకులను అనుక్షణం టెన్షన్ కి గురి చేయనున్నాయి. పైగా ఇది రియల్ స్టోరీతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.ఈ సినిమా టైటిల్ 13 లైవ్స్. ఆస్కార్ విజేత రాన్ హోవార్డ్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ డ్రామా ఇది. టైటిల్ కి తగ్గట్టే అద్భుతమైన కేవ్ రెస్క్యూ కథనం తో తెరకెక్కిన ఈ మూవీ పరిమితంగా థియేటర్ లలోకి వస్తోంది.

అలాగే ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ నిజ జీవిత మనుగడ కథను ఇష్టపడతారని నిర్మాతలు చెబుతున్నారు. ఇది ఇటీవలి కాలంలో అత్యంత భయంకరమైన రెస్క్యూ మిషన్ (నిజ ఘటన) కథతో తెరకెక్కింది. భయానక `మెమరీ: థామ్ లుయాంగ్` గుహ రెస్క్యూకి సంబంధించిన కథాంశంతో రూపొందినది.

అంతేకాదు.. తదుపరి ఆస్కార్ రేస్ లో ఉండే సినిమాగానూ ఈ మూవీకి ఇప్పటికే బోలెడంత హైప్ కనిపిస్తోంది. `ఉత్తమ చిత్రం` కేటగిరీలో 2023 ఆస్కార్ రేస్ లో టాప్ మూవీస్ లో ఒకటిగా ఇది పాపులరవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పెంచింది. అకాల మరణం నుండి 13 మంది యువకుల సమూహాన్ని రక్షించడానికి పూర్తి అపరిచితులు అయిన రెస్క్యూ అధికారులు ఎంత దూరం వెళ్లారు అన్నది తెరపై చూడాల్సిందే. ప్రాణాలకు తెగించి  సిబ్బంది ఎంతగా శ్రమించారు? అన్నది ఉత్కంఠను కలిగిస్తుంది.

13 లైవ్స్ ఆగస్టు 2022లో ఓటీటీ అలాగే థియేటర్లలోకి రానుందని టాక్ వినిపిస్తోంది. థర్టీన్ లైవ్స్ కు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ కి ఖచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించాల్సి ఉంది. వెరైటీ కథనం ప్రకారం రాన్ హోవార్డ్ బయోగ్రాఫికల్ సర్వైవల్ డ్రామా ఆగస్టు 2022లో ఏదో ఒక తేదీని లాక్ చేసుకుని విడుదలకు వస్తుందన్న సమాచారం ఉంది. ఓటీటీ సంగతి ఎలా ఉన్నా ఈ మూవీ థియేట్రికల్ విడుదలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

పాపులర్ పంపిణీ సంస్థ MGM నుంచి మార్చి 2022లో అమెజాన్ ప్రైమ్ 8.5 బిలియన్ డాలర్లకు ఈ మూవీని కొనుగోలు చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడానికి కొద్దిసేపటి ముందు పరిమిత థియేటర్లలో విడుదల చేయనున్నారు.