కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళు అమ్ముకుంటున్నారు...!

Wed Jul 15 2020 18:00:13 GMT+0530 (IST)

They are selling body to fill their stomachs ...!

'బంగారం' సినిమా హీరోయిన్ మీరాచోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో ఎప్పుడో కనుమరుగైన మీరా చోప్రా ఇటీవల అనూహ్యరీతిలో తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఎవరో తెలియదని చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ అమ్మడు ఒక్కసారిగా నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది.ఇటీవల ముంబైలోని సెక్స్ వర్కర్లు దారుణమైన స్థితిలో ఉన్నారని.. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందించడం లేదని సోషల్ యాక్టివిస్ట్ అశోక్ పండిత్ ట్వీట్ పై స్పందించిన మీరా చోప్రా... ''కమాతిపుర అనే సిరీస్ లోనే నటించే క్రమంలో సెక్స్ వర్కర్లతో మాట్లాడినప్పుడు వారి జీవన పోరాటం చూసి ఎంతగానో బాధపడ్డాను. వారు తమ కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళు అమ్ముకోవడం అనేది అత్యంత బాధకరమైన విషయం'' అని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా ఓ నెటిజన్ మీరా చోప్రాని ఉద్దేశిస్తూ ''ఓ స్టాండ్ అప్ కమెడియన్ కు వచ్చిన రేప్ బెదిరింపుల మీద మీరెందుకు నోరు విప్పడం లేదు?.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారని చెబుతారుగా'' అని ప్రశ్నించారు. దీనిపై మీరా స్పందిస్తూ "జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నన్ను రేప్ చేస్తామని బెదిరించారు . దీన్ని బట్టి ఇండియాలో మహిళల సేఫ్టీ గురించి సీరియస్ గా తీసుకోలేదనిపిస్తోంది. తమ ఫ్లాట్ ఫార్మ్ పై ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో కూడా ఈ ట్విట్టర్ పట్టించుకునే స్థితిలో లేదు" అని ట్వీట్ చేసింది. ఇక తెలంగాణా మినిస్టర్ కేటీఆర్ కి కంప్లైంట్ చేసిన ట్వీట్ కూడా స్క్రీన్ షార్ట్ తీసి ఓ నెటిజన్ కి షేర్ చేసింది. మొత్తం మీద మీరాచోప్రా ఏదొక ఇష్యూ మీద మాట్లాడుతూ.. నెటిజన్స్ అడిగే వాటికి కూడా సమాధానం చెప్తూ నిత్యం వార్తల్లో ఉంటూ వస్తోంది.