Begin typing your search above and press return to search.

టాలీవుడ్ అంతటికీ ఎడ్వాన్సులు ఇచ్చారట..!

By:  Tupaki Desk   |   13 Nov 2019 5:30 PM GMT
టాలీవుడ్ అంతటికీ ఎడ్వాన్సులు ఇచ్చారట..!
X
టాలీవుడ్ లో అదో పెద్ద బ్యానర్. టాప్ హీరోలు మీడియం రేంజ్ హీరోలతో వరసగా సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. మొదట్లో వరసగా హిట్లతో దూసుకుపోవడంతో అందరికీ కన్నుకుట్టే పరిస్థితి వచ్చింది కానీ ఈమధ్య వరస ఫ్లాపులతో సంస్థవారు కాస్త డీలా పడ్డారు.. దీంతో కుళ్ళుబోతు జనాల కడుపుమంట పూర్తిగా చల్లారింది! అయితే ఇప్పటికీ ఈ సంస్థ చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. అంతా బాగానే ఉంది కానీ ఒక విషయంలో మాత్రం ఈ బ్యానర్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆదే ఎడ్వాన్సుల విషయం.

పెద్ద స్టార్ హీరోలు.. మీడియం రేంజ్ హీరోలు.. సక్సెస్ సాధించిన డైరెక్టర్లు ఇలా ఎవరైనా సరే.. ఈ సంస్థ వారికి ఎడ్వా న్స్ ఇచ్చేస్తుంది. ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో అయితే మూడు మూడు సినిమాల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారట. ఈ ఎడ్వాన్సుల వ్యవహారం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్లు సాధించిన దర్శకులకు కూడా ఇస్తున్నారట. ఈ సంస్థ గురించి టాలీవుడ్ లో ప్రచారంలో ఉన్న ఒక పాపులర్ డైలాగు ఏంటంటే.. 'వారి దగ్గర ఎడ్వాన్స్ తీసుకోవడం వింత కాదు.. తీసుకోకపోతేనే వింత!'

ఇలా అందరికీ ఎడ్వాన్సులు ఇస్తూ ఉండడంతో.. ఈ గోలతో తన సినిమా విషయంలో 100% ఫోకస్ ఉంటుందా ఉండదా.. అనే అనుమానంతో ఈమధ్య ఒక పెద్ద స్టార్ హీరో సదరు సంస్థ ఇచ్చిన ఎడ్వాన్స్ డబ్బును తిరిగి ఇచ్చాడట. ఇలా ప్రతి ఒక్కరికీ ఎడ్వాన్స్ ముట్టజెప్పే విషయంలో ఆ సంస్థ లెక్కలు వారికి ఉండొచ్చుకానీ జనాలు మాత్రం 'ఎంతమందికి ఎడ్వాన్సులు ఇస్తారు సామి' అంటూ కామెంట్ చేస్తున్నారు.