Begin typing your search above and press return to search.

హిట్ సినిమా ముగ్గురు మొనగాళ్లు మళ్లీ రాబోతున్నారు!

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:00 AM GMT
హిట్ సినిమా ముగ్గురు మొనగాళ్లు మళ్లీ రాబోతున్నారు!
X
శ్రీవిష్ణు.. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన బ్రోచేవారెవరురా చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్‌ ఆడియన్స్ కు బాగా కనెక్ట్‌ అయిన ఆ సినిమాలో నటించిన ముగ్గురు కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు.

ఆ ముగ్గురు పండించిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ముగ్గురు కూడా బిజీ అయ్యారు. ఎవరికి వారు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో మరోసారి ఈ ముగ్గురు మొనగాళ్లు కలిశారు. వీరి కలయికలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హుషారు చిత్ర దర్శకుడు హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ ముగ్గురు ప్రధాన పాత్రలో సినిమా ప్రారంభం అయ్యింది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా యొక్క చిత్రీకరణ కేరళలో జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

హర్ష కొనుగంటి విభిన్నమైన స్క్రిప్ట్‌ ను ఎంపిక చేసుకుని ఎంటర్‌ టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిది హిట్ కాంబో కనుక మళ్లీ కలిసి వస్తే తప్పకుండా హిట్ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.