ఆస్కార్.. ఈ నాలుగు ఇండియన్ సినిమాలు పైనల్

Sat Oct 23 2021 13:00:02 GMT+0530 (IST)

These four Indian movies are final For Oscar

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆస్కార్ కోసం ఇండియన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ప్రతి ఏడాది పోటీ పడటం వెనక్కు రావడం చాలా కామన్ గా జరుగుతూనే ఉంటుంది. కాని ఆస్కార్ అవార్డుల కోసం ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియన్ ఆస్కార్ జ్యూరీ ఎన్నో సినిమాలను చూసి చివరకు ఆస్కార్ నామినేషన్స్ కు పంపించదగ్గ సినిమాలని నాలుగు సినిమాలను ఎంపిక చేయడం జరిగింది. రెండు హిందీ సినిమాలు కాగా ఒకటి మలయాళం మరోటి తమిళం. ఈ నాలుగు సినిమాలు కూడా ఆస్కార్ అవార్డు రేసులో నిలువబోతున్నాయి. ఎన్నో పదుల సినిమాలను చూసిన తర్వాత కంటెంట్ మరియు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ సినిమాలను ఆస్కార్ నామినేషన్స్ కు పంపించారు.వచ్చే ఏడాది మార్చిలో జరుగబోతున్న ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఈ సినిమాలకు చోటు ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ నాలుగు సినిమాలు కూడా నామినేషన్ దక్కించుకోవడమే చాలా గొప్ప విషయంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని వందల సినిమాలు ప్రతి ఏడాది ఇండియన్ సినీ పరిశ్రమ నుండి వస్తుంటాయి. కాని ఆస్కార్ రేంజ్ లో ఒక్క సినిమా కూడా ఉండక పోవడం విచారకరం. ఇండియన్ సినిమా టెక్నికల్ పరంగా కూడా హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉంటుంది. కాని ఇప్పటికి కూడా ఆస్కార్ లను మాత్రం దక్కించుకోలేక పోతున్నాయి. ఇక ఈ ఏడాదికి ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల విషయానికి వస్తే సర్దార్ ఉద్దమ్.. షేర్నీ.. మండేలా.. నాయట్టు.

ఈ నాలుగు సినిమాలు కూడా నాలుగు విభిన్నమైన కాన్సెప్ట్ లతో రూపొందడం జరిగింది. సర్దార్ ఉద్దమ్ సినిమా ఒక అద్బుతమైన దేశ భక్తి సినిమా. దేశ చరిత్రలో ఎప్పటికి నిలిచి పోయే జలియన్ వాలా బాగ్ ఉదంతంకు పాల్పడిన వ్యక్తిని ఒక వ్యక్తి చంపేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఇక షేర్నీ సినిమా విషయానికి వస్తే ఒక పులి గ్రామంలోకి వచ్చిన సమయంలో కొందరు దాన్ని చంపి గ్రామస్తులను కాపాడాలి అనుకుంటే.. ఒక మహిళ అటవి అధికారి మాత్రం ఆ గ్రామస్తులను కాపాడటంతో పాటు పులిని కూడా కాపాడాలని అనుకుంటుంది. ఇక తమిళ మండేలా సినిమా పంచాయితీ ఎన్నికల్లో ఒక ఓటు కీలకంగా మారుతుంది. ఆ ఓటు మంగళి వ్యక్తిది. ఆ ఓటు కోసం చేసే ప్రయత్నాలే సినిమా. ఇక మలయాళ నాయట్టు రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థ మద్య జరిగే పోరాటమే ఈ సినిమా. ఈ నాలుగు సినిమాలు కూడా ఖచ్చితంగా జాతీయ అవార్డుకు అర్హం అయిన సినిమాలు. అలాంటి సినిమాలకు ఆస్కార్ అవార్డు దక్కుతుందా అనేది చూడాలి.