ఈ వారం ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..!

Wed May 12 2021 23:00:01 GMT+0530 (IST)

These are the movies that are being released in OTT this week

కరోనా మహమ్మారి విజృంభనతో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడంతో థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో ఇళ్లకే పరిమితమైన సినీ అభిమానులకు ఇప్పుడు మళ్లీ ఓటీటీ వేదికలే దిక్కయ్యాయి. ఇప్పటికే పలు కొత్త సినిమాలని స్ట్రీమింగ్ పెట్టి వీక్షకులను అలరించడానికి ఓటీటీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారంలో నాలుగు సినిమాలు - ఒక వెబ్ సిరీస్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లోకి వస్తున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమా పే ఫర్ వ్యూ విధానంలో ఈద్ సందర్భంగా మే 13న రిలీజ్ అవుతోంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ ప్లెక్స్ - డిష్ టీవీ - డీటుహెచ్ - టాటా స్కై - ఎయిర్ టెల్ డిజిటల్ టీవీల్లో విడుదల కానుంది. థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన 'రాధే' కోవిడ్ పరిస్థితుల్లో పే-పర్-వ్యూ ప్రాతిపదికన ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు దర్శకుడు రాజ్ & డీకే రూపొందించిన 'సినిమా బండి' సినిమా మే 14న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - సాంగ్ తో ఇదొక డిఫరెంట్ సినిమా అని అర్థం అవుతోంది. అలానే రామ్ నారాయణన్ దర్శకత్వం వహించిన 'బట్టల రామస్వామి బయోపిక్కు' సినిమా మే 14న డిజిటల్ వేదికపై విడుదల కానుంది. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

విజయ్ సేతుపతి - రాశీఖన్నా - నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన 'విజయ్ సేతుపతి' చిత్రాన్ని 'ఆహా' యాప్ లో మే 14న అందుబాటులోకి రానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'డి కంపెనీ' మే 15న విడుదల అవుతోంది. కొత్తగా స్టార్ట్ అవుతున్న 'స్పార్క్' ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

హాలీవుడ్ సూపర్ హీరో డ్రామా 'వండర్ ఉమెన్ 1984' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ నెల 15న రిలీజ్ కానుంది. అలానే మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన 'నవంబర్ స్టోరీ' వెబ్ సిరీస్ మే 20న వస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు తమిళ హిందీ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు క్లోజ్ అయినప్పటికీ.. డిజిటల్ వేదికలు కావల్సినంత వినోదాన్ని అందించడానికి రెడీ అవుతున్నాయని అర్థం అవుతోంది.