ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

Wed Jan 25 2023 07:00:02 GMT+0530 (India Standard Time)

These are the movies releasing this week

సగటు మనిషికి కాలక్షేపం వినోదం అంటే సినిమాలే. ఇక సినీ లవర్స్ అయితే వారం వారం రిలీజ్ అయ్యే మూవీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత ఓటీటీలో సినిమాలు వచ్చినప్పటికి... చాలామంది థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కోరుకుంటారు. థియేటర్లో జనాల చప్పట్లు ఈలలు మధ్య సినిమా చూడడం వారికి అదో కిక్కు. ఈవారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.దాదాపు నాలుగేళ్ల బ్రేక్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పఠాన్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించాడు. షారుక్ కు జోడిగా దీపిక పడుకొని నటించింది.

ఇక టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన హంట్ మూవీ కూడా ఈ జనవరి 26న థియేటర్లో రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు గతాన్ని మర్చిపోతాడు అలాంటి వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ గా కేసును ఎలా పరిష్కరించాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండనుంది. సీనియర్ హీరో శ్రీకాంత్ తో పాటు కోలీవుడ్ హీరో భరత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఒకప్పటి హీరో శివ బాలాజీ నటిస్తున్న తాజా చిత్రం సింధూరం ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది లో పెరకెక్కిన ఈ సినిమాకు శ్యాం తుమ్మలపల్లి దర్శకత్వం వహించాడు.

ఇక మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన తమిళ మూవీ మలికాపురం... తెలుగులో డబ్ చేసి... జనవరి 26న రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ కోసం రూపొందిన అలోన్ సినిమాను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ వారం తీసుకొస్తున్నారు. ఎర్రర్ ఫైవ్ హండ్రెడ్ ది ఆక్సిడెంట్ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను ఉన్నాయి. వీటిలో ప్రేక్షకులు దేనికి జై కొడతారో ఈవారం గడిస్తే గాని చెప్పలేం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.