ఈ వారం థియేటర్ ఓటీటీ ద్వారా రాబోతున్న సినిమాలు సిరీస్ లు

Tue Nov 29 2022 20:25:17 GMT+0530 (India Standard Time)

These are the movies in theaters and OTTs this week

ప్రతి వారం వారం థియేట్రికల్ రిలీజ్ సినిమాలు మరియు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ లు మరియు సినిమాలు షో లు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఒకప్పుడు థియేట్రికల్ రిలీజ్ కోసమే జనాలు వెయిట్ చేసే వారు.. కానీ ఇప్పుడు ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్ అవ్వబోతున్న సినిమాలు ఏంటీ.. సిరీస్ లు ఏంటా అనే ఆసక్తి కనబరుస్తున్నారు.థియేట్రికల్ రిలీజ్ ప్రతి వారం ఉన్నట్లుగానే ఓటీటీ లో కూడా ప్రతి వారం శుక్ర లేదా కాస్త అటు ఇటుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. భారీ ఎత్తున ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు మరియు సిరీస్ లు ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ను అందించబోతున్నాయి.

ఈ వారం థియేట్రికల్ రిలీజ్ అవ్వబోతున్న సినిమాల్లో ప్రధానంగా హిట్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా తెలుగు లో కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 2వ తారీకున హిట్ 2 సినిమా థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అంతే కాకుండా మలయాళం మూవీ గోల్డ్ ను డిసెంబర్ 1వ తారీకున.. మట్టి కుస్తీ తెలుగు సినిమాను డిసెంబర్ 2వ తారీకున.. తమిళ్ మూవీ డీఎస్‌పీ ని డిసెంబర్ 2 వ తారీకున.. యాన్ యాక్షన్ హీరో అనే హిందీ సినిమాను కూడా డిసెంబర్ 2వ తారీకున థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఇక ఓటీటీ ల ద్వారా కొన్ని సినిమాలు మరియు షో లు కూడా ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ప్రధానంగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కామెడీ షో ఈ వారం ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. డిసెంబర్ 2 న మొదటి ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిపీట్ అనే సినిమాను డిసెంబర్ 1వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతే కాకుండా తమిళం మరియు హిందీ సినిమాలు ఇంకా సిరీస్ లు చాలానే ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా వినోదాల విందు పక్కా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.