Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ 6 కంటెస్టెంట్స్ వీళ్లే..!

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 AM GMT
బిగ్‌ బాస్ 6 కంటెస్టెంట్స్ వీళ్లే..!
X
తెలుగు బిగ్ బాస్‌ సీజన్ 6 కి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. కంటెస్టెంట్స్‌ దాదాపుగా ఫైనల్ అయ్యారని స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న ఈ సీజన్‌ లో బుల్లి తెర మరియు వెండి తెర సెలబ్రెటీలతో పాటు సోషల్‌ మీడియా మరియు యూట్యూబ్‌ సెలబ్రెటీలు సందడి చేయబోతున్నారు.

చాలా కాలంగా బిగ్ బాస్ సీజన్‌ 6 లో ఉదయ భాను స్పెషల్‌ కంటెస్టెంట్ గా నిలవనుందంటూ వార్తలు వచ్చాయి. ఆమె ఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

ఆమె ఎంట్రీ కచ్చితంగా ప్రేక్షకులకు మంచి ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక నేహా చౌదరి కూడా ఎంట్రీకి సిద్దం అయ్యిందట. ఆమె అందాల ఆరబోత తో బిగ్ బాస్‌ హౌస్‌ తడిసి ముద్ద అయ్యే అవకాశం ఉంది.

వారు మాత్రమే కాకుండా సిరి హనుమంతు యొక్క ప్రియుడు శ్రిహాన్‌.. యూట్యూబ్‌ లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పే ఆది.. యూట్యూబర్ గీతూ రాయల్‌.. జబర్దస్త్‌ ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్న అప్పారావు మరి కొందరు బుల్లి తెర మరియు వెండి తెర ప్రముఖులు ఈ షో లో సందడి చేయడం కోసం ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యారు.

సెలబ్రెటీలతో పాటు ముగ్గురు సామాన్యులకు కూడా ఈసారి ఛాన్స్ ఉంటుందట. ఇప్పటికే వారి కోసం ఆడిషన్స్ జరిగాయి. వేల కొద్ది వచ్చిన అప్లికేషన్ నుండి కొందరిని ఎంపిక చేయడం జరిగిందని.. త్వరలోనే వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించి ఐసోలేషన్ కి పంపించబోతున్నారట.

అక్కడ నుండి డైరెక్ట్‌ గా బిగ్ బాస్ హౌస్‌ కి వారు వెళ్లబోతున్నారు. గత సీజన్‌ లతో పోల్చితే ఈ సారి మరింత రసవత్తరవంగా ఆట ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.