Begin typing your search above and press return to search.

స‌త్య‌దేవ్ కెరీర్ ట‌ర్నింగ్ ఛాన్సెస్ ఇవి!

By:  Tupaki Desk   |   27 Sep 2022 5:55 AM GMT
స‌త్య‌దేవ్ కెరీర్ ట‌ర్నింగ్ ఛాన్సెస్ ఇవి!
X
ట్యాలెంటెడ్ న‌టుడు స‌త్య‌దేవ్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. ఎలాంటి బ్య‌క్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న న‌టుడు. స‌హాయ పాత్ర‌ల్లో మెప్పిస్తూ రేర్ గా త‌నే ప్ర‌ధాన పాత్ర‌ల్లో కొన్ని సినిమాలు కూడా చేసాడు. ముఖ్యంగా బ్ల‌ప్ మాస్ట‌ర్ అత‌నికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ కాక‌పోయినా న‌టుడిగా మంచి పేరు తీసు కొచ్చింది.

ఇంకా 'గుర్తుందా శీతాకాలం' లాంటి సినిమాలో త‌మ‌న్నాతోనే రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల డిలే అవుతుంది. అలాగే' కృష్ణ‌మ్మ' అనే మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు స‌త్య‌దేవ్కి క‌లిసొస్తాయా? లేదా ? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేంగానీ...యువ న‌టుడి ఖాతాలో రెండు భారీ బ‌డ్జెట్ చిత్రాలైతే ఉన్నా్యి.

అవే 'గాడ్ ఫాద‌ర్'.. బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న 'రామ్ సేతు'. ఈ రెండు సినిమాల్లో స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాడు. గాడ్ ఫాద‌ర్ లో న‌య‌న‌తార భ‌ర్త పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. పేరుకే భ‌ర్త కానీ ఆ పాత్ర‌లో భారీ మాసిజాన్ని క‌ట్ట‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని సీన్లలో ఏకంగా మెగాస్టార్ నే ఎదిరించే డైలాగులకు మంచి పేరొస్తుందని టాక్ ఉంది.

టాలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ స‌త్య‌దేవ్ కి ఇలాంటి రోల్ ప‌డ‌లేదు. ఇప్పుడా ఛాన్స్ ముంగిట ఉన్న నేప‌థ్యంలో న‌టుడి కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంద‌ని టాక్ వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'రామ్ సేతు'లోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అక్షయ్ వెన్నంటే ఉండే ఓ ముఖ్యమైన పాజిటివ్ పాత్రను సత్యదేవ్ కి ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఈ పాత్ర గ‌నుక వ‌ర్కౌట్ అయితే బాలీవుడ్ లో స‌త్య‌దేవ్కి మంచి అవకాశాలు వ‌స్తాయ‌ని ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. న‌ట‌న ప‌రంగా త‌న‌దైన స‌హ‌జ‌త్వంతో క‌నెక్ట్ అవ్వ‌డానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమాపై బాలీవుడ్ చాలా ఆశ‌లే పెట్టుకుంది. స‌క్సెస్ అయితే రామ్ సేతు త‌ర్వాత స‌త్య‌దేవ్ కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసు కుంటుంద‌ని గుస‌గుస వినిపిస్తుంది.

ఇలా ఒకేసారి రెండు సినిమాల్లో న‌టించ‌డం స‌త్య‌దేవ్ ల‌క్ అనే చెప్పాలి. ఎంతో మంది న‌టులున్నా స‌త్య‌దేవ్ ని వెతుక్కుంటూ వ‌చ్చిన అవ‌కాశాలివి. అక్క‌డే అత‌ని ప‌నిత‌నం క‌నిపిస్తుంది. గాడ్ ఫాద‌ర్ ఆక్టోబ‌ర్ 5న‌...రామ్ సేతు అక్టోబ‌ర్ 25న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.