ఈ కుర్ర హీరోలందరికీ హిట్ పడాల్సిందే

Tue Jan 24 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

These Heros Need a Hit Movies

ఓ వైపు మన స్టార్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతూ దూసుకుపోతున్నారు. తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ కూడా ప్రస్తుతం పెరిగింది. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసే స్థాయికి మన నిర్మాతలు వెళ్ళారు. అలాగే మన స్టార్ హీరోలైన రామ్ చరణ్ ప్రభాస్ బన్నీ తారక్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటివారు వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే మార్కెట్ రేంజ్ ని పెంచుకున్నారు. ఇక సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవికి పాన్ ఇండియా మార్కెట్ లేకపోయిన తెలుగులోనే వందల కోట్ల కలెక్షన్స్ చేసే సినిమాలు చేస్తున్నారు. అయితే టైర్ 2 హీరోలుగా ఉన్న యంగ్ స్టార్స్ మాత్రం సక్సెస్ కోసం పాట్లు పడుతున్నారు. వరుణ్ తేజ్ కి స్టార్ హీరో ఛాన్స్ లు దగ్గరగా ఉన్నాయి.అయితే అతని చివరి సినిమా గని డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో చేస్తున్న గాండీవదారి అర్జున మూవీతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే ఇక హీరో రామ్ చాలా కాలంగా ఉన్న టైర్ 2 హీరోల జాబితాలోనే ఉండిపోయాడు. కమర్షియల్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో తడబడుతున్నారు. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాతో గట్టి హిట్ కొట్టాలని కసిగా ప్రయత్నం చేస్తున్నాడు. రామ్ నుంచి చివరిగా వచ్చిన ది వారియర్ మూవీ డిజాస్టర్ అయ్యింది.

ఇక నితిన్ కూడా కెరియర్ లో ఎత్తుపల్లాలు చూస్తూ టైర్ 2 హీరోల జాబితాలో కొనసాగుతున్నాడు. అతని నుంచి చివరిగా వచ్చిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. చివరిగా మాచర్ల నియోజకవర్గం కూడా ఫ్లాప్. అయితే ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా చేస్తున్నాడు.

దీంతో హిట్ కొట్టాలని కసిగా పని చేస్తున్నాడు. ఇక అక్కినేని నాగార్జున నట వారసుడిగా వచ్చిన అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన చేసిన నాలుగు సినిమాలు అతనికి ఆశించిన సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి.

 కెరియర్ ఆరంభం అయిన తర్వాత సరైన సక్సెస్ లేకపోయిన అఖిల్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ సారి ఆ క్రేజ్ కి తగ్గ హిట్ ఏజెంట్ తో కొడతాడని అందరూ ఆశిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ హీరోగా ఈ సినిమాతో ఎస్టాబ్లిష్ చేసుకునే ఛాన్స్ అతనికి వచ్చింది. మరి దీనిని ఎలా యూజ్ చేసుకుంటాడు అనేది చూడాలి. ఇక సాయి ధరమ్ తేజ్ 2019లో చిత్రలహరి ప్రతిరోజు పండగే సినిమాలతో హిట్ కొట్టాడు. ఆ తరువాత చేసిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో అతనికి సక్సెస్ ఇవ్వలేదు.

డిఫెరెంట్ కథాంశంతో వచ్చిన రిపబ్లిక్ మూవీ కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ సక్సెస్ మాత్రం కాలేదు. ప్రస్తుతం విరూపాక్ష అనే సినిమాని తేజ్ చేస్తున్నాడు. దీంతో సూపర్ హిట్ కొడతానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. అలాగే గోపీచంద్ కూడా రామబాణం అనే సినిమా ప్రస్తుతం చేస్తున్నాడు. ఈ మూవీతో అతను కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందే. ఇలా యువ హీరోలు అందరికి ఈ ఏడాది కచ్చితంగా హిట్స్ పడాల్సిన టైమ్ వచ్చింది. మరి వారికి ఈ ఏడాది అనుకూలిస్తుందా లేదా అనేది చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.