దేశంలోనే ఇలాంటి యూజ్ లెస్ డైరెక్టర్ లేడు

Tue Aug 11 2020 12:45:49 GMT+0530 (IST)

There is no such useless director in the country

`వెంటనే థ్రిల్లర్ టికెట్లు బుక్ చేసుకోండి. 20 మంది లక్కీ విన్నర్స్ అప్సరా రాణితో నాతో కలిసే ఛాన్స్ కొట్టేయండి`` ఇదీ వర్మ గారి లేటెస్ట్ బొనాంజా బంపరాఫర్. ఆగస్టు 14 రాత్రి 9 గంటలకు ఆర్జీవీ `థ్రిల్లర్` మూవీని వరల్డ్ థియేటర్ లో లాంచ్ చేసేస్తున్నాడు. అయితే ఈ మూవీని చూసేదెవరు? అన్నదే సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ఏటీటీ అంటూ నాశిరకం సినిమాలు.. బూతు సినిమాలు తీస్తూ జనాల్ని వంచిస్తున్న వర్మను పట్టించుకునేది ఎవరు? అన్నది సస్పెన్స్  గా మారింది.అయినా అప్సర రాణీని కలిసే అవకాశం అంటూ ఇలా ఎర వేస్తే జనం రూ.200 ధర చెల్లించి ఆన్ లైన్ ఏటీటీలో సినిమాని చూస్తారా? అసలే జనం దగ్గర డబ్బుల్లేవ్. కనీసమాత్రంగా అయినా బతికేందుకు సంపాదించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో జనం జేబులు ఖాళీ చేసేందుకు వర్మ ఆఫర్లు ప్రకటించడం .. గ్లామర్ డాళ్ ఫోటోల్ని ఎరవేసి.. టెంప్ట్ చేస్తూ.. యూత్ కి గిలిగింతలు పెడుతూ.. సన్నివేశాన్ని క్యాష్ చేసేసుకుందామనే ఆత్రాన్ని ప్రదర్శించడం చూస్తుంటే జనాన్ని మరీ అంత అమాయక వీపీల్లా చూస్తున్నాడా? అన్న కామెంట్లు సోషల్ మీడియాల్లో సౌండ్ చేస్తున్నాయి.

అంతేకాదు.. ఒక నెటిజన్ అయితే ఆర్జీవీని ఓ రేంజులోనే ఆడుకున్నాడు. అసలు దేశంలోనే ఇలాంటి హుచ్చా సినిమా వేరొకటి ఉండదని.. దీనికోసం రూ.200 పెట్టాలా? అని ఘోరంగా ప్రశ్నించాడు. యూజ్ లెస్ డైరెక్టర్ అంటూ వర్మను తిట్టేశాడు ట్విట్టర్ లో. మొన్న పవర్ స్టార్ సినిమా చూశాక.. ఇది సినిమాకి తక్కువ.. యూట్యూబ్ వీడియోకి తక్కువ! అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా పేరుతో అమ్మకాలు సాగించేస్తే ప్రతిసారీ టెంప్ట్ అయ్యి కొనేస్తారా? అన్న తిట్లు పడుతున్నాయ్.  పైసా పెట్టుబడి ప్రచారానికి కేటాయించకుండా సినిమాలు తీసి చెత్తి సినిమాల్ని రిలీజ్ చేయాలన్న వర్మ ఉబలాటం ప్రతిసారీ బయటపడుతోంది. అయితే ఇలా ఓటీటీ.. డిజిటల్ ఎదుగుతున్న వేళ వర్మ దానిని ఏటీటీ పేరుతో  చెడగొట్టడం సరైనదేనా? అన్నది ప్రశ్నిస్తున్నారు.  క్లైమాక్స్ .. నగ్నం అంటూ అడల్ట్ సినిమాలతో యూత్ ని రెచ్చగొట్టాలని చూసినా ఇప్పటికే అసలు వర్మ సీనేంటో యూత్ కి కూడా అర్థమైపోయింది. ఇలాంటప్పుడు అప్సరను ఎరవేస్తే థ్రిల్లర్ చూస్తారా? అన్నది సందిగ్ధమే.