Begin typing your search above and press return to search.

'పిట్టకథల'లో లస్ట్ తగ్గించారా.. అమలాపాల్, శృతి ఊరటనిస్తారా??

By:  Tupaki Desk   |   22 Jan 2021 2:30 AM GMT
పిట్టకథలలో లస్ట్ తగ్గించారా.. అమలాపాల్, శృతి ఊరటనిస్తారా??
X
హిందీలో పాపులర్ అయిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకు కాకపోయినా యువత మాత్రం ఆల్రెడీ ఓ లుక్కేసే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్‌ ఇండియా రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ అది. నిజానికి బోల్డ్ కంటెంట్ అందించడంలో నెట్ ఫ్లిక్స్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు అదే నెట్ ఫ్లిక్స్ వారు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ను తెలుగులో పిట్టకథలు పేరుతో విడుదల చేయనుంది. నాలుగు కథలు కలిగిన ఈ వెబ్ సిరీస్ లో భార్యభర్తల మధ్య బంధాలు, సంసారంలో కలిగే సమస్యలు, ఇష్టాయిష్టాలు, అలకలు ఇలా అన్ని అంశాలను మేళవించి తీస్తున్నారు డైరెక్టర్లు. అయితే హిందీలో చేసిన లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ తో ఘాటు సన్నివేశాలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఒకవిధంగా ఆ సన్నివేశాలే నెట్ ఫ్లిక్స్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక అందులో కియారా అద్వానీ చేసిన సీన్స్ అయితే చెప్పక్కర్లేదు. అయితే తెలుగు పిట్టకథలులో మాత్రం లస్ట్ తప్ప అన్ని వర్కౌట్ చేసినట్లున్నారు డైరెక్టర్స్.

ఎందుకంటే బాలీవుడ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినట్లుగా అలాంటి బోల్డ్ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులు చూడరనే టాక్ నడుస్తోంది. అందుకే మరీ శృంగారభరితంగా కాకుండా కాస్త డీసెంట్ గా చూపించడానికి ట్రై చేసినట్లున్నారు. అయితే తెలుగులో ఈషారెబ్బా, లక్ష్మి మంచు, అమలాపాల్, శృతిహాసన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే తాజాగా విడుదల చేసిన పిట్టకథలు టీజర్ లో ఏమాత్రం జోష్ లేదని అంటున్నారట నెటిజన్లు. అయితే టీజర్ చూసిన వారి కళ్లు మాత్రం అమలాపాల్, శృతిహాసన్ లపై నిలవడం ఖాయం. ఎందుకంటే వారిద్దరి క్యారెక్టర్ లలో మాత్రమే కాస్త బోల్డ్ సన్నివేశాలు ట్రై చేసినట్లున్నారు మేకర్స్. ఇక అమలాపాల్, శృతిహాసన్ లను చూస్తే శృంగార ప్రియులకు కాస్త ఊరట కలగవచ్చట. ఇక లెస్బియన్ పాత్రలో శృతి వేరే అమ్మాయితో లిప్ లాక్ సీన్ కూడా చేసింది. మరి చూడాలి తెలుగులో పిట్టకథలు ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో.. రెండేళ్లుగా జరుగుతున్న ఈ లస్ట్ స్టోరీస్ రీమేక్ సిరీస్ ఎట్టకేలకు ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. చూడాలి మరి ఫస్ట్ నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న డైరెక్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్.. ఎలా ఉండబోతుందో!