అప్పట్లో హాట్ సూపర్ మోడల్.. ఇప్పుడు ఫోటోగ్రాఫర్

Tue Apr 23 2019 23:00:01 GMT+0530 (IST)

Than Super Model Now Photographer

శీతల్ మల్లర్ పేరు ఎప్పుడైనా విన్నారా?  శీతల్ 90లలో ఒక హాట్ సూపర్ మోడల్. పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మోడల్ గా పని చేసింది.  ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా మారి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కు ఫోటోలు అందిస్తోంది.  ఇప్పుడు శీతల్ వయసు 45 ఏళ్ళు.కర్ణాటక మూలాలున్న తుళు భామ ముంబైలోనే పుట్టి పెరిగింది. 17  ఏళ్ళ వయసులోనే మొదటి సారి మోడలింగ్ అసైన్ మెంట్ టేకప్ చేసింది.  ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే లేకుండా పోయింది. 1994 ఫెమినా లుక్ ఆఫ్ ది ఇయర్ సాధించింది. మోడలింగ్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అర్మాని.. ఫెండి లాంటి అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ స్ కు.. మేబెలిన్ కాస్మెటిక్స్ కు బ్రాండ్ అంబాజిడర్ గా పని చేసింది. అయితే మోడలింగ్ కెరీర్ దీర్ఘకాలం ఉండదు కదా. అందుకే మిడిల్ ఏజ్ లో ఫోటోగ్రఫీని ప్రొఫెషన్ గా ఎంచుకుని ట్రైనింగ్ తీసుకుంది.  

ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్న తర్వాత ఈ భామ విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో ఫోటోగ్రాఫర్ గా కొత్త కెరీర్ ను మొదలు పెట్టింది. అర్కిటెక్చరల్ డైజెస్ట్.. స్టార్ బక్స్ ఇండియా.. వెర్వ్ మ్యాగజైన్ లాంటి వాటికి ఫోటోగ్రాఫర్ గా కొన్ని అసైన్ మెంట్స్ పై వర్క్ చేసింది.  ఇప్పుడు అలాంటివాటితో పాటు అర్బన్ లైఫ్ స్టైల్ పై ఫోటోలు తీస్తూ వాటికి సంబంధించిన ప్రదర్శనను కూడా తరచూ ఏర్పాటు చేస్తూ ఉంటుంది.  మోడలింగ్ కెరీర్ ముగిసిన తర్వాత చాలామంది మోడల్స్ కు లైఫ్ ను ఎలా లీడ్ చేయాలో తెలియక  డిప్రెషన్ లోకి వెళ్తారు. అలాంటి వారికి శీతల్ లైఫ్ ఖచ్చితంగా ఒక ప్రేరణ.

అన్నట్టు.. శీతల్ హాటు మోడల్ గా ఉన్న రోజుల్లో ఫోటో.. ఇప్పుడు నలభై ఐదేళ్ళ వయసులో ఉన్నరోజుల్లో ఉన్న ఫోటో పైనే ఉన్నాయి..  ఒక లుక్కేయండి.  లాస్ట్ లో ఉన్న బికిని పిక్ పోయినేడాది గోవా ట్రిప్ లో తీసిందట.  వయసుపెరిగినా హాట్ నెస్.. స్టైల్ ఏమాత్రం తగ్గలేదు..!