అప్పుడు బాలయ్య మనవడు.. ఇప్పుడు పవన్ తనయుడు

Wed Oct 27 2021 13:01:25 GMT+0530 (IST)

Then Balayya Grandson Now Pawan Son

ప్రముఖ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో పవన్ తో పాటు పలువురు ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు. అందులో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అకీరా నందన్ ను క్రిష్ పరిచయం చేయాలని చాలా ఆశ పడుతున్నాడు. అందుకోసం హరి హర వీరమల్లు సినిమా లో కీలకమైన ఒక చిన్న పాత్రను క్రియేట్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. పవన్ కూడా అకీరా డెబ్యూకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. వారం రోజుల పాటు అకీరా ప్రత్యేక శిక్షణ తీసుకుని ఆ తర్వాత కేవలం రెండు రోజుల్లోనే షూట్ ను ముగించబోతున్నాడట. షూటింగ్ లో అకీరా పాల్గొనేది ఎప్పుడు అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణ మనవడు అయిన నారా దేవాన్ష్ ను 'ఎన్టీఆర్' బయోపిక్ లో పరిచయం చేయడం జరిగింది. నారా దేవాన్ష్ కనిపించింది కొద్ది సమయం అయినా కూడా నందమూరి అభిమానులు క్రిష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే క్రిష్ తన తాజా చిత్రంలో పవన్ తనయుడిని పరిచయం చేయబోతున్నాడు. పవన్ వంటి సూపర్ స్టార్ తనయుడు ను పరిచయం చేయడం అంటే ఖచ్చితంగా గొప్ప అచీవ్మెంట్. ఎందుకంటే భవిష్యత్తులో అకీరా సూపర్ స్టార్ అయితే ఆ సమయంలో అతడి మొదటి సినిమా క్రిష్ దర్శకత్వంలో అని చెప్పుకోవాల్సిందే. అలాంటి అరుదైన ఫీట్ ను క్రిష్ దక్కించుకునేందుకు పట్టుబట్టి పవన్ ను ఒప్పించి అకీరాను ఈ సినిమా లో నటింపజేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

హరి హర వీరమల్లు సినిమా లో అకీరా నటిస్తున్న విషయం ప్రస్తుతం అందరిలో చర్చనీయాంశంగా ఉంది. అభిమానులు ఈ వార్తలు నిజం అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. క్రిష్ ఈ సినిమా లో మంచి పాత్రలో అకీరాను పరిచయం చేయాలని.. ఆ తర్వాత కూడా అకీరా వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు. మొత్తానికి హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించిన విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటి వరకు ఈ విషయమై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. రేణు దేశాయ్ ను సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఈ విషయాన్ని క్లారిఫై చేయాల్సింగా కోరుతున్నారు. పవన్ మూవీలో అకీరా ఉంటే ఖచ్చితంగా అది సంచలనమే అనడంలో సందేహం లేదు. పవన్ కు కూడా అకీరాను హీరోను చేయాలనే కోరిక ఉన్నట్లుంది. అందుకే డాన్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ ను కూడా అకీరాకు పవన్ నేర్పించిన విషయం తెల్సిందే.