Begin typing your search above and press return to search.

థీమ్ ఆఫ్ 'సినిమా బండి': 'బావిలోన కప్ప' సాంగ్..!

By:  Tupaki Desk   |   12 May 2021 3:26 PM GMT
థీమ్ ఆఫ్ సినిమా బండి: బావిలోన కప్ప సాంగ్..!
X
'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మేకర్స్ రాజ్ & డీకే రూపొందించిన లేటెస్ట్ తెలుగు సినిమా ''సినిమా బండి''. కొత్త దర్శకుడు ప్రవీణ్ కందిరేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వసంత్ మరింగంటి స్టోరీ అందించారు. మే 14న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమా బండి నుంచి తాజాగా 'బావిలోన కప్ప' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'బావిలోన కప్ప తీరు.. బెకరు బెకరు అంటావా.. గూటిలోన గువ్వ తీరు.. గుటూరు గుటూరు అంటావా.. అయ్యో అయ్యయ్యో..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ శిరీష్ సత్యవోలు ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయడమే కాకుండా లిరిక్స్ రాసి తనదైన శైలిలో ఆలపించారు. 'సినిమా బండి' థీమ్ ని తెలియజేసేలా ఉన్న సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అపూర్వ శాలిగ్రామ్ - సాగర్ వైవీవీ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు.రవితేజ గిరిజాల - ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

''సినిమా బండి'' సినిమా ఆటోలో దొరికిన డిజిటల్ కెమెరాను ఉపయోగించి తన గ్రామస్థులతో కలిసి ఓ ఆటో డ్రైవర్ సినిమా ఎలా తీసాడనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అమాయకపు మనస్తత్వాలు కలిగిన కొందరు వ్యక్తులు సినిమా తీయడానికి, నిజాయితీగా చేసే ప్రయత్నాలు ఆహ్లాదకరంగా సహజంగానూ ఇందులో చూపించబోతున్నారు. ఈ సినిమాలో వికాస్ వశిష్ఠ - సందీప్ వారణాసి - రాగ మయూర్ - త్రిషార - ముని వెంకటప్ప - ఉమ - సింధు తదితరులు నటించారు. 'సినిమా బండి' చిత్రాన్ని డి2ఆర్ ఇండీ బ్యానర్ పై దర్శకద్వయం రాజ్ & డీకే నిర్మించారు.