మహేష్ ఇంట్లో దొంగ దొరికాడిలా!

Fri Sep 30 2022 10:42:13 GMT+0530 (India Standard Time)

Theft at Mahesh Babu's house

సూపర్ స్టార్ మహేష్ ఇంట్లో ఓ దొంగ చోరీయత్నానికి ప్రయత్నించాడు. ఇంట్లో ఎవరూ లేని  సమయాన్ని గమనించి రాత్రి 11 గంటల సమయంలో  ఈ ఘటనకి పాల్పడలని చూసాడు. కానీ తాను ఒకటి తలిస్తే...అక్కడ మరొకటి జరిగింది. దొంగతనం గొడవ దేవుడెరుగు. దొంగతనానికి ప్రయత్నించి గాయాల పాలయ్యాడు. అదెలాగో? తెలియాలంటే..విషయంలోకి వెళ్లాల్సిందే.జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 81లో నివసిస్తున్న మహేశ్  ఇంట్లో దొంగతనం చేయాలని భావించిన కృష్ణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రహరీ గోడ ఎక్కి లోపలి దూకాడు. ఆ గోడ చాలా ఎత్తుగా ఉండడంతో కిందడి దొంగ గాయపడ్డాడు.

శబ్దం రావడంతో మహేష్ ఇంటి సెక్యూరిటీ వెళ్లి చూడగా గాయాలతో పడి ఉన్న దొంగ కనిపించాడు. దీంతో సిబ్బంది  వెంటనే పోలీసులకి సమాచారం అందించి దొంగని పోలీసులకి అప్పజెప్పారు. అనంతరం ఆయన్ని ఉస్మానియా ఆసుపతమ్రికి తరలించి వైద్యం అందించారు.

ఆ దొంగని పోలీసులు విచారించగా అతడి పేరు కృష్ణ (30) అని   తెలిసింది. మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఓ నర్సరీ వద్ద ఉంటున్నట్టు..ధనవంతుడు  కావాలనే ఆశతో  మహేష్  ఇంట్లో చోరికి యత్నించినట్లు తెలిపాడు. ఫలితంగా గోడ ఎక్కువ ఎత్తు ఉండటంతో  ఆ దొంగ ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది.

మహేష్ తల్లి..కృష్ణ సతీమణి ఇందిరాదేవి స్వర్గస్తులైన నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా అదే హడావుడిలో ఉన్నారు. మహేష్  దంపతులు ఇందిరాదేవి ఇంటిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే దొంగ ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి ఛోరికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ దొంగ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ ఇంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భద్రత పెంచినట్లు సమాచారం. సాధారణంగా ఆ ప్రాంతమంతా భద్రత పరంగా పష్టింగానే ఉంటుంది. నిత్యం వ్యక్తిగత సిబ్బంది...పోలీసుల గస్తీ ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.