దళపతి ఫ్యాన్స్ కి కావాల్సింది ఇదే..!

Tue Dec 06 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Thee Thalapathy Song From Varasudu Film

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు మూవీ పై దళపతి విజయ్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. విజయ్ వారసుడు పక్కా క్లాస్ ఆడియన్స్ కోసమే అంటూ వారు చేస్తున్న ప్రచారాలు ఉన్నాయి. రిలీజైన ఫోటోలు.. రంజితమే సాంగ్ ఇవన్ని వారసుడు క్లాస్ ఎంటర్టైనర్ గానే అనిపించింది. దళపతి ఫ్యాన్స్ కోరుకునే మాస్ అప్పీల్ ఈ మూవీ ఇస్తుందా లేదా అని డౌట్ పడ్డారు. కానీ లేటెస్ట్ గా సినిమా నుంచి రిలీజైన సాంగ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. థీ దళపతి అంటూ వచ్చిన ఈ సాంగ్ అదిరిపోయింది.  విజయ్ మాస్ ఇమేజ్ కి తగినట్టుగా ఈ సాంగ్ ఉండగా.. ఈ పాటలో మరో విశేషం ఏంటంటే కోలీవుడ్ స్టార్ శింబు ఈ సాంగ్ ని పాడారు. విజయ్ మీద తనకున్న అభిమానంతో థీ దళపతి సాంగ్ పాడారు శింబు.

దళపతి ఫ్యాన్స్ కి ఈ సాంగ్ బాగా ఎక్కేసింది. అందుకే ఇలా రిలీజైందో లేదో అలా వైరల్ చేసేశారు. వారసుడు కథ ఏంటి.. మహర్షి సినిమానే మళ్లీ తీస్తున్నాడు అన్న కామెంట్స్ కి ఈ పాటతో ఆన్సర్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి. థమన్ మ్యూజిక్.. శింబు వాయిస్.. విజయ్ క్రేజీ లుక్స్ ఇవన్ని పాటని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి.

దళపతి విజయ్ కెరీర్ లో ఫస్ట్ టైం బైలింగ్వల్ మూవీగా వారసుడు చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని 2023 సంక్రాంతికి భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి చిరు బాలయ్య సినిమాలు వస్తున్నా వాటిని ఢీ కొడుతూ విజయ్ వారసుడుని వదులుతున్నారు.

తెలుగులో కూడా విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉండగా డైరెక్ట్ విజయ్ ఫ్యాన్స్  ఎంతమంది.. విజయ్ కి టాలీవుడ్ స్టామినా ఏంటి అన్నది ఈ మూవీతో ప్రూవ్ అవుతుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా ఆదరించే తెలుగు ఆడియన్స్ దళపతి విజయ్ వారసుడు సినిమాను ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి.

ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో దళపతి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని చిత్రయూనిట్ చెబుతున్నారు. ఇన్నాళ్లు ఏమో కానీ థీ దళపతి సాంగ్ రిలీజ్ అయ్యాక మాత్రం వారిసు అదే వారసుడు మీద ఫ్యాన్స్ అంచనాలు డబుల్ అయ్యాయి. వారసుడు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.