Begin typing your search above and press return to search.

OTT ల‌పై అజ‌మాయిషీ సాధ్య‌ప‌డేదేనా?

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:30 PM GMT
OTT ల‌పై అజ‌మాయిషీ సాధ్య‌ప‌డేదేనా?
X
ఓటీటీల్లో పెద్ద సినిమాల్ని ఎన్ని వారాల త‌ర్వాత‌ రిలీజ్ చేయాలి? అదే చిన్న సినిమాల‌ను అయితే ఎన్ని వారాల‌కు రిలీజ్ చేయాలి? అంటే దీనిపై ఇప్ప‌టికీ ఒక స్పష్ఠ‌త క‌ర‌వ‌డింది. ఒక ఫిక్స్ డ్ టైమ్ ఏదీ క‌నిపించ‌డం లేదు. ఒక్కో సినిమాని బ‌ట్టి ఒక్కోలా డ్యూరేష‌న్ మారుతోంది. అయితే తాజాగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి నేతృత్వం వహిస్తున్న సీనియర్ నిర్మాత దిల్ రాజు ఓ చాటింగ్ లో చేసిన వ్యాఖ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది.

ఆయ‌న వ్యాఖ్య‌ల ప్ర‌కారం.. ``పెద్ద స్టార్ల సినిమాలు ఏడు వారాలు (50 రోజుల) థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే OTTలో విడుదలవుతాయి. ఐదు వారాల తర్వాతే ఓటీటీలో చిన్న హీరోల సినిమాలు వస్తాయి`` అని దిల్ రాజు అన్నారు. అంటే దీన‌ర్థం ఓటీటీల్లో ఇష్టానుసారం రిలీజ్ చేసుకోవ‌డం కుద‌ర‌ద‌నే. థియేట్రిక‌ల్ వ్యాపారాన్ని ఓటీటీలు తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్నాయి.

ఓటీటీలతో నిరంత‌రం యుద్ధం సాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఎవ‌రూ నియంత్రించ‌లేని స్థాయికి ఓటీటీ సంస్థ‌లు ఎదిగేశాయి. ఇవి నెమ్మ‌దిగా థియేట‌ర్ వ్యాపారాన్ని క‌బ్జా చేస్తున్నాయ‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. నిజానికి ఓటీటీ డీల్స్ తోనే చాలా సినిమాలు సేఫ్ అవుతున్నాయ‌న్న చ‌ర్చ న‌డుమ చాలా మంది నిర్మాత‌లు కూడా దీని గురించి గుంబ‌న‌గానే ఉన్నారు. ఓటీటీ ఆగమనం నియంత్రించలేనిది. OTT హక్కుల ద్వారా వచ్చే ఆదాయం ఈ రోజుల్లో సినిమా వ్యాపారంలో ప్రధాన భాగం. కొన్ని చిత్రాలు నాన్ థియేట్రికల్ హక్కులతో సురక్షితం అవుతున్నాయి. ఇది ఓటీటీ డీల్స్ వ‌ల్ల‌నే పాజిబుల్ అవుతోంది.. నిర్మాతకు ఏది బెస్ట్ మోడల్ అని నిర్ణయించుకునేందుకు గిల్డ్ మోకాల‌డ్డ‌లేదని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇంత‌కుముందు అగ్ర నిర్మాత‌లు మోకాల‌డ్డాల‌ని చూసినా కానీ ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీ విడుద‌ల‌ను ఆప‌లేక‌పోయారు. ఇటీవల పుష్ప మేకర్స్ వారి థియేటర్లలో విడుదలైన మూడు వారాల తర్వాత OTT విడుదలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనిని ఎవరూ ఆప‌లేదు. ఆర్.ఆర్.ఆర్ స‌హా ఇత‌ర పెద్ద సినిమాలు ఎప్పుడు రిలీజ‌వ్వాల‌న్న‌ది నిర్మాత‌ల ఒప్పందంలో ముందే ఫిక్స్ అయ్యి ఉంటుంది. దేనినీ ఎవ‌రూ మార్చ‌లేరు. ఇక‌పోతే ఉత్ప‌త్తిని త‌యారు చేసేవాడికే ధ‌ర‌ను నిర్ణ‌యించే హ‌క్కు ఉంటుంది. అలాగే ఎప్పుడు ఎలా త‌మ సినిమాని రిలీజ్ చేయాలి? అనేది నిర్మాత నిర్ణ‌యించుకోవాలి. ఇందులో వేరొక‌రి ఫింగ‌రింగ్ స‌రికాద‌నేది మెజారిటీ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. అగ్ర నిర్మాత డిసురేష్ బాబు కానీ.. ఆర్జీవీ కానీ చెప్పేది ఇదే. ఓటీటీల‌తో డీల్ విష‌యంలో భారీగా డిమాండ్ చేసేందుకు నిర్మాత‌లు వెన‌కాడ‌డం లేదు. దీనిని బ‌ట్టి ఓటీటీల‌కు వెసులుబాటు ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.