కళ్ల ముందు చావులు చూసి కన్నీరు పెట్టుకున్న యంగ్ హీరో

Sun May 09 2021 21:29:19 GMT+0530 (IST)

The young hero who saw the deaths before his eyes and shed tears

కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ఒకరికి ఒకరు సాయంగా నిలవడంతో పాటు ఎవరికి వారు ధైర్యంగా ఉండాలంటూ యంగ్ హీరో నిఖిల్ ఒక వీడియో మెసేజ్ లో పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితులతో నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితులో పక్కన వారి గురించి వారి శ్రేయస్సు గురించి కాస్త అయినా పట్టించుకోవాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.నిఖిల్ మాట్లాడుతూ... షూటింగ్ లకు కరోనా వల్ల బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ఉంటున్నాము. ఇంట్లో వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఖాళీగా ఉంటున్న సమయంలో స్నేహితులతో కలిసి తమకు చేతనైనంత సాయం చేయాలని భావించాం. కొందరం కలిసి ఒక టీమ్ గా ఏర్పాటు అయ్యి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆక్సీజన్ కావాలంటూ విజ్ఞప్తి చేశాడు. కొన్ని గంటల్లో ఆక్సీజన్ ను ఏర్పాటు చేసి దాన్ని పంపించేందుకు మళ్లీ సంప్రదించగా వ్యక్తి చనిపోయాడనే సమాధానం వచ్చింది.

చూస్తుండగానే జనాలు చనిపోతున్నారు. కళ్ల ముందు జనాలు మృతి చెందుతూ ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమయంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే సరిపోతుంది. వారికి జనాల ఆరోగ్యం గురించి పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా లేదు. అందుకే ఒకరికి ఒకరం అన్నట్లుగా మనమే ఇతరులకు సాయంగా నిలవాలంటూ విజ్ఞప్తి చేశాడు. దయచేసి బయటకు వెళ్లవద్దని చెప్పడంతో పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు.